మాస్ రాజా రీమేక్ ఆగిపోనుందా?

Update: 2017-10-31 11:21 GMT

టాలీవుడ్ లో కష్టపడి ఎంతో ఇష్టంగా హీరోగా ఎదిగిన రవి తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. కెరీర్ క్లోజ్ అవుతోంది అనే కామెంట్స్ వస్తోన్న సమయంలో రవి తేజ ప్రయోగాత్మకమైన రాజా ది గ్రేట్ కథని నమ్మి హిట్ అందుకున్నాడు. ఈ రోజుల్లో ఏ హీరో చేయని రోల్ చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. గత కొంత కాలంగా హిట్టులు లేక సతమతమైన ఈ హీరో ఫైనల్ గా ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి.

ఇక ఇప్పటి నుండి కథ కొత్తగా ఉంటేనే సినిమాను చేస్తానని చెప్పిన రవితేజ మరో డిఫరెంట్ కథని ఒకే చేశాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన భోగన్ రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యాడు. తమిళ్ లో జయం రవి - అరవింద్ స్వామి నటించిన బోగన్ సినిమా అక్కడ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ యాక్షన్ త్రిల్లర్ ని తెలుగులో రవితేజ రీమేక్ చెయ్యడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. కాని మ్యాటర్ ఏంటంటే.. చివరి నిమిషంలో ఈ ప్లాన్ డ్రాప్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) ఒక కొత్త కథ చెప్పాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథను రాసుకున్నాడట బాబీ. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన  పవర్  సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాగే ఎనర్జటిక్ కథ అంటున్నారు. అయితే ఈ కాంబినేషన్ ని త్వరలోనే నిర్మాత రామ్ అట్లూరి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. అందుకే ఇప్పుడు బోగాన్ రీమేక్ ను పక్కనెట్టేసినట్లే అంటున్నారు సన్నిహితులు.
Tags:    

Similar News