మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా గుసగుస వినిపిస్తున్నా.. సరిగ్గా ఏడాది క్రితం అధికారికంగా ప్రాజెక్ట్ ప్రకటించారు. కానీ ఇంతవరకూ పట్టాలెక్కింది లేదు. ఈ గ్యాప్ లో రవితేజ వేర్వేరు దర్శకులతో సినిమాలు చేసారు కానీ.. త్రినాధరావుకి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వాస్తవానికి `క్రాక్` తర్వాత త్రినాధరావు సినిమా ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇప్పటివరకూ అది జరగలేదు. `ఖిలాడీ`..`రామారావు ఆన్ డ్యూటీ `చిత్రాల్ని వేర్వేరు దర్శకులతో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రినాధరావు సినిమా క్యాన్సిల్ అయినట్లేనని కూడా కథనాలు వెలువడ్డాయి.
మరి అంతిమంగా త్రినాధరావు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. పీపూల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించచడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. మరి ప్రాజెక్ట్ ఇంత ఆలస్యానికి కారణం ఏంటి? అంటే స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్యన పొంతన కుదరనట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ఒకే చేసిన తర్వాత రవితేజ మార్పులు కోరడం.. ధపధపాలుగా కొత్త వెర్షన్స్ వినిపించడం జరిగిందిట. కానీ రవితేజ సంతృప్తి చెందక ఇన్నాళ్లు డిలే అయినట్లు మాట్లాడుకుంటున్నారు.
చివరిగా స్క్రిప్ట్ పై త్రినాధరావు- రైటర్ ప్రసన్న జోడీ ఎట్టకేలకు రవితేజని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా పక్కా కమర్శియల్ చిత్రమని తెలుస్తోంది. గతంలో త్రినాధరావు `మేం వయసుకు వచ్చాం`.. `సినిమా చూపిస్త మావ`..`నేను లోకల్`..`హలో గురుప్రేమ కోసమే` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ లు చూసే మాస్ రాజా ఛాన్స్ ఇచ్చారు. కానీ రవితేజ కారణంగా ఆలస్యమైంది. చివరిగా మూడేళ్ల క్రితం మొదలైన ప్రచారం ఇప్పుడు నిజం కాబోతుంది.
వరుస సినిమాలతో రాజా బిజీ బిజీ
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బరిలో `క్రాక్`తో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. గాడి తప్పిన బండిన క్రాక్ తో తిరిగి పట్టాలెక్కించారు. గత వైభవాన్ని తిరిగి తేవాలన్న కసితో రవితేజ ఈ సినిమా కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారో తెలిసిందే. క్రాక్ తరవాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రవితేజ బిజీ అయ్యారు. తదుపరి రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. టాకీ చిత్రీకరణ పూర్తయింది. అటు పోస్ట్ ప్రోడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని గుసగు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పెన్ స్టూడియోస్- ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరో వైపు రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ `అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
`రామారావు ఆన్ డ్యూటీ ` తర్వాత రవితేజ మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజులో సినిమా చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించి గత రెండేళ్లుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. స్టువర్ట్ పురం దొంగ అయిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి కమర్శియల్ అంశాలు జోడించి మాస్ రాజా ఇమేజ్ కు ఎంత మాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్ తో బహుభాషల్లో నిర్మిస్తున్నారు.