మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావ్ ఆన్ డ్యూటీ''. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇంతలో ఈరోజు బుధవారం మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
'రామారావ్ ఆన్ డ్యూటీ' చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలుమార్లు వాయిదా పడింది.
చివరగా రవితేజ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఫైనల్ గా 'రామారావ్ ఆన్ డ్యూటీ' మూవీని జూలై 29న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
విడుదలకు ఇంకా ఐదు వారాల సమయం ఉండగా.. రాబోయే రోజుల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ వంటి ఇద్దరు హీరోయిన్లు నటించారు. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. నాజర్ - సీనియర్ నరేష్ - పవిత్ర లోకేష్ - ‘సర్పట్ట’ జాన్ విజయ్ - చైతన్య కృష్ణ - తనికెళ్ల భరణి - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.