22 ఆగ‌స్టు 7 పీఎం మెగా బ‌ర్త్ డే హంగామాకి రెడీనా?

Update: 2021-08-20 00:30 GMT
22 ఆగ‌స్టు.. మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఇంకో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది కాబ‌ట్టి అభిమానుల్లో కోలాహాలం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మెగా ఫ్యాన్ క్ల‌బ్బుల్లో బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌డి ర‌చ్చ‌గా మారుతోంది.

మ‌రోవైపు ట్విట్ట‌ర్ స్పేసెస్ లో హంగామా సృష్టించేందుకు యాంక‌ర్ సుమ హోస్ట్ గా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ప్లాన్ చేయ‌గా .. సుమ ఫ్యాన్స్ లోనూ జోష్ మొద‌లైంది. 22 ఆగ‌స్టు 7.02 పీఎంకి ఈ హంగామా కోసం వేచి చూడండి. స్పేస్ లింక్ ఇదిగో రిమైండ‌ర్ పెట్టుకోండి అంటూ ప్ర‌చారం హోరెత్తిపోతోంది. మెగా స్టార్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని ఈసారి సోష‌ల్ మీడియా ల వేదిక‌గా ప్ర‌త్యేకంగా జ‌రుపుకోనుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. #సెల‌బ్రేట్ మెగాస్టార్ ఎరా #జై చిరంజీవ ఫోల్డెడ్ హ్యాండ్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్ లు వైర‌ల్ అవుతున్నాయి.

క‌రోనా క్రైసిస్ కాలంలో మెగాస్టార్ సేవ‌ల‌కు గొప్ప గుర్తింపు ద‌క్కింది. ఆయ‌న స‌కాలంలో చిరంజీవి ట్ర‌స్ట్ త‌ర‌పున‌ ఆక్సిజ‌న్ సిలిండెర్ల‌ను అందించ‌డంతో చాలా ప్రాణాల్ని కాపాడ‌గ‌లిగారు. ఇండ‌స్ట్రీలో కార్మికులు పేద ఆర్టిస్టుల‌కు ఆయ‌న ఆర్థిక సాయం అందించారు. ఎన్నో మంచి ప‌నుల‌తో చిరుపై ప్రేమాప్యాయ‌త‌లు మ‌రింత‌గా పెరిగాయి. ఇలాంటి సంద‌ర్భంలో మెగా బ‌ర్త్ డేని అభిమానులు మ‌రింత ప్ర‌త్యేకంగా జ‌రుపుకునేందుకు ప్లాన్ చేయ‌డం విశేషం.

మ‌రోవైపు చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో 65 ప్ల‌స్ ఏజ్ లో బిజీగా ఉండ‌డం విశేషం.  ఇప్ప‌టికిప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాల్లో న‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. మ‌రో న‌లుగురు ద‌ర్శ‌కుల‌తో క‌థ‌లు త‌యారు చేయిస్తున్నార‌. ఏజ్ తో ప‌ని లేకుండా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా న‌టిస్తూ సాటి స్టార్ల‌లో స్ఫూర్తి నింపుతున్న మెగాస్టార్ తీరు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఆయన 66వ ఏట అడుగుపెట్టేందుకు స‌రిగ్గా ఇంకో రెండు రోజులు ఉంది. 22 ఆగ‌స్ట్ 2021 చిరు బ‌ర్త్ డే.  #చిరు HBD య‌జ్ఞం వంద రోజుల ముందే మొద‌లైంది. మెగాస్టార్ జ‌న్మ‌దిన సేవా మ‌హోత్స‌వాలు-2021 పేరుతో చిరంజీవి యువ‌త ఆల‌యాల్లో పూజ‌లు ప్రారంభించారు. మే6 కాణిపాకం వినాయ‌క స్వామి ఆల‌యంలో ఉత్స‌వాలు మొద‌లు పెట్టి వ‌రుస‌గా ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లాచ‌రిస్తున్నారు.

https://twitter.com/i/spaces/1YqJDegeERDxV
Tags:    

Similar News