ఈనాడు అధినేత రామోజీరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీస్ లో ఒకరిగా.. మీడియా మొఘల్ గా ఆయనకున్న పేరుప్రఖ్యాతులెన్నో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ను తప్పు పట్టటం అన్నది దివంగత వైఎస్ ముందు లేదని చెప్పాలి. ఆ తర్వాత వైఎస్ వర్సెస్ రామోజీ మధ్య ఎపిసోడ్ అందరికి తెలిసిందే. మీడియా మొఘల్ గా అభివర్ణించే రామోజీని రాజకీయానికి దూరంగా ఉండే వారెవరూ వేలెత్తి చూపించే సాహసం చేయలేరు. అది.. ఆయన ప్రత్యేకత. అలాంటి రామోజీపై సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్యన కొన్ని అంశాల మీద తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పేసే సినీ రంగ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ రామోజీకి చెందిన ఈటీవీలో ప్రసారమయ్యే ఒక ప్రోగ్రామ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల్ని ఆయన మాటల్లోనే చెబితే.
తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్దాయన అంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. కష్టపడి పని చేసి.. ఆయన ఏకంగా ఒక ఎంపైర్‌ను సృష్టించారు. అంత కష్టపడి పని చేసిన ఆయనెవరో కాదు.. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు. న్యూస్ పేపర్ పెట్టి.. ఛానళ్లు పెట్టి.. చాలా కష్టపడి విలువల్ని పాటిస్తూ.. ప్రజలంతా నమ్మేలా.. ఆదర్శంలా.. ఫోర్త్ ఎస్టేట్ అంటే అసలైన ఫోర్త్ ఎస్టేట్ మాదిరి.. మీడియా అంటే మీడియా మాదిరి.. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా విలువలతో కూడిన కార్యక్రమాలు రూపొందించటం.. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా ఛానల్ లో ప్రసారం చేస్తారన్న పేరుంది.
డబ్బు సంపాదించటం కష్టం. కానీ.. డబ్బు.. పేరు సంపాదించారు. విలువలు కాపాడుకొచ్చారు. అలాంటి ఆయన ఛానల్ ను ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఏ ఛానల్ లో ఉండనంత దారుణంగా డబుల్ మీనింగ్ డైలాగులతో కార్యక్రమాన్ని ప్రస్తారం చేస్తున్నారు. ఆ ఛానల్ ను చూసే వారంతా.. రామోజీ రావును చూసే ఆ ఛానల్ చూస్తుంటారు. రామోజీరావు మీద గౌరవంతో చూస్తుంటారు.
ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు.. రామోజీ రావు తొమ్మిది గంటల వరకూ వార్తలు చూసేసి.. తర్వాత పడకుంటారు. ఆ తర్వాత ఛానల్ లో వచ్చే కార్యక్రమాన్నిచూడరన్నారు. అది సరికాదుకదా. చూసినా చూడకున్నా.. పెద్దాయన అలా చేయకూడదు కదా. ఆయన చూడకుండా ఉంటే ఇప్పటికైనా చూడాలని.. పేరుకోసం.. డబ్బులు కోసం.. నెంబరింగ్ కోసం చాలా చేయొచ్చు కానీ.. రామోజీ రావు కాదు. ఆయనంటే గౌరవం.. నమ్మకం.
రెండు రాష్ట్రాల్లోనూ ఆయనంటే ఎంతో నమ్మకం. అందుకే ఆయన పేపర్ నెంబర్ వన్.. ఆయన ఛానల్ నెంబర్ వన్. రామోజీ ఫిలింసిటీని ఇప్పటికీ చూసేందుకు లక్షల మంది వస్తుంటారు. ఆయన్ను అందరూ అంతగా గౌరవిస్తారు. ఆయన పట్టించుకుంటారన్న ఆశతో.. బాధతో అంటున్న మాటలు ఇవి. ఫ్యామిలీస్ అంతా చూస్తున్న ప్రాగ్రామ్స్ ఇవి. ఈ మధ్య పెట్టిన ఛానళ్లలోనూ వీటిని ఎక్కువగా చూపిస్తున్నారు. కాస్త రిస్ట్రిక్ చేస్తే బాగుంటుంది.
నీకెందుకు ఇవన్నీ అనొచ్చు. గతంలో ఏదైనా బాగోపోతే.. మాటీవీ.. జీటీవీ.. జెమినీ టీవీ యాజమాన్యానికి నేరుగా ఫోన్ చేసి చెప్పటం జరిగింది. నేను ఫోన్ చేస్తే రామోజీ రావుకు ఫోన్‌చేస్తే ఫోన్ ఎత్తుతారో లేదో తెలీదు.. అందుకే పబ్లిక్ గా చెప్పదలుచుకున్నా. ఆయనకు చెప్పాలనుకున్న విషయాన్ని ఆయనకు చెప్పలేక.. ఆయన్ను రీచ్ కాలేక.. ఇలా చెబుతున్నా. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఫ్యామిలీస్ చూసేలా చేస్తే బాగుంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/