ప్రభాస్ పెళ్లి అందుకే ఆలస్యం?

Update: 2017-12-13 10:30 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి కానీ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ అందరి చూపు ఒక్కరి వైపే ఉందని చెప్పాలి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తుతం ఎంత మంది ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు కూడా పెరిగిపోవడంతో ప్రభాస్ పెళ్లి చేయాలనీ వారి కుటుంబ సభ్యులు సంబంధాలు కూడా బాగానే చూస్తున్నారట. అయినా ప్రభాస్ కి కాబోయే భార్య అతనికి తగ్గట్టు ఉండాలి కాబట్టి కొంచెం టైమ్ పట్టక తప్పదు.

అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి స్పందించారు. ప్రభాస్ కి సెట్ అయ్యే అమ్మాయిని చూస్తున్నాం. జాతకం వంటి కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అన్ని సెట్ అయ్యాక ప్రభాస్ కి నచ్చితే ముహుర్తాలు పెట్టించేస్తామని వివరణ ఇచ్చారు. ఇక ప్రభాస్ కూడా దాదాపు తన కుటుంబ సభ్యుల నిర్ణయానికే తన పెళ్లి విషయాన్ని వదిలేశాడట ప్రభాస్. అయితే ఈరోజుల్లో కూడా ఇలా జాతకం అంటూ వెయిట్ చేస్తూ ప్రభాస్ ను బ్యాచిలర్ గా ఉంచేస్తే ఎలా? ఓ ప్రక్కన జ్యోతిష్యం మూఢనమ్మకం అంటూ చాలామంది గొంతెత్తి అరుస్తున్నారుగా మాష్టారూ!!

ఇకపోతే తాను అనుష్కతో రిలేషన్ లో ఉన్నట్లు వస్తోన్న వార్తలకు ప్రభాస్ ఎప్పటికపుడు కౌంటర్లు వేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం కేవలం సాహో సినిమా గురించి తప్ప ఇతర విషయాల గురించి చర్చించడం లేదని చాలా సార్లు వివరణ ఇచ్చాడు. మరి ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది డౌటే? మరి ప్రభాస్ 2019లో సినిమాను రిలీజ్ చేసి అప్పటికైనా పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.     


Tags:    

Similar News