ఆ గుండు భామే.. ఇప్పుడిలా..

Update: 2018-01-10 13:14 GMT
అవును లాంటి మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన భామ పూర్ణ. ఈ భామ అసలు పేరు షామ్నా ఖాసిం. బోలెడంత ట్యాలెంట్ ఈ బ్యూటీ.. తమిళం.. మలయాళంలో తెగ సినిమాలు చేసేస్తూ ఉంటుంది.

ఇప్పుడీ బ్యూటీ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తోంది. మన దగ్గర సాంప్రదాయంగా కనిపించే పాత్రలనే చేసిన ఈమె.. మోడర్న్ గా కూడా కనిపిస్తానని ఈ హెయిర్ స్టైల్ చెప్పకనే చెప్పింది. అయితే.. ఇంత షార్ట్ హెయిర్ తో ఉందేంటబ్బా అనిపించక మానదు. కొత్త హెయిర్ స్టైల్ ఈమెకు సూపర్ గా ఉంది కానీ.. ఇలా మారడం వెనక చాలానే స్టోరీ ఉంది. గతేడాది ఓ తమిళ సినిమా కోసం షామ్నా గుండు కొట్టించేసుకుని షాక్ ఇచ్చింది. పూర్తిగా పెర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్ కోసం అలా చేసింది. అలాగని ఇదేమీ లీడ్ హీరోయిన్ రోల్ కాదు. అయినా సరే ఓ క్యారెక్టర్ డిమాండ్ చేసిందని.. ఏకంగా గుండు కొట్టించేసుకుని షాక్ ఇచ్చేసింది షామ్నా ఖాసిం.

ఇప్పుడు కొద్దిగా పెరిగిన జుట్టుని.. మోడర్న్ హెయిర్ స్టైల్ గా మార్చేసి.. ఇలా మారిపోయింది షామ్నా. గతేడాది తమిళ్ మూవీ కొడివీరన్ లో నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సవరకత్తి అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయని.. అయితే తన పాత్రకు కాసింత అయినా ప్రాధాన్యత ఉంటేనే ఆయా సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లుగా చెబుతోంది షామ్నా ఖాసిం.

Tags:    

Similar News