సుశాంత్‌ ఎఫెక్ట్‌ : ఆలియా సినిమాకు చెత్త వరల్డ్‌ రికార్డ్‌

Update: 2020-08-12 15:30 GMT
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి తర్వాత బాలీవుడ్‌ స్టార్స్‌ లో కొందరు చాలా ట్రోల్స్‌ ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆలియా భట్‌ వంటి స్టార్‌ కిడ్స్‌ ను సుశాంత్‌ మృతికి ముందు వరకు నెత్తిన పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు పాతాలానికి తొక్కేలా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆలియా భట్‌ ఎక్కువగా నష్టపోతుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఆలియా భట్‌ సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ ఇప్పటికే లక్షల్లో తగ్గిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమె నటించిన సడక్‌ 2 చిత్రానికి గాను చెత్త ప్రపంచ రికార్డ్‌ ను సొంతం చేసుకునేలా ఉంది.

ఆలియా భట్‌ హీరోయిన్‌ గా సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించిన సడక్‌ 2 చిత్రం ఈ నెలలో ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. సినిమా ట్రైలర్‌ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు మహేష్‌ భట్‌ దర్శకత్వం వహించడంతో పాటు ఆలియా భట్‌ నటించడం వల్ల సుశాంత్‌ అభిమానులు రెచ్చి పోయి మరీ యూట్యూబ్‌ లో ఈ ట్రైలర్‌ కు అన్‌ లైక్‌ కొడుతున్నారు. కేవలం 5 గంటల్లో ఈ ట్రైలర్‌ 1.9 మిలియన్‌ వ్యూస్‌ ను దక్కించుకుంది. అయితే 1 మిలియన్‌ అన్‌ లైక్స్‌ ను కూడా పొందడం చెత్త రికార్డుగా చెప్పుకోవచ్చు.

రెండు మిలియన్‌ ల లోపు వ్యూస్‌ ఉంటే మిలియన్‌ డిస్‌ లైక్స్‌ రావడం అంటే ఖచ్చితంగా ప్రపంచ రికార్డ్‌ అంటున్నారు. ఇప్పటి వరకు మూడు మిలియన్‌ ల వ్యూస్‌ వస్తే 1. 5 మిలియన్‌ ల డిస్‌ లైక్స్‌ కు ఎక్కువగా ఉన్నాయి. అంటే మహేష్‌ భట్‌ మరియు ఆలియా భట్‌ లపై నెటిజన్స్‌ ఏ స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాకు కూడా ఇదే స్థాయిలో నెగిటివిటీ ప్రచారం చేస్తే సినిమా ఫలితం తారు మారు అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
Tags:    

Similar News