బాలీవుడ్ ఆ 'అమ్మ' ఇక‌లేరు

Update: 2017-05-18 05:22 GMT
బాలీవుడ్ అమ్మ‌గా సుప‌రిచురాలు.. ప్ర‌ముఖ న‌టి రీమా లాగూ(59) ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. ప‌లు హిందీ చిత్రాల్లో త‌ల్లిపాత్ర‌ను పోషించి మెప్పించారు. బుధ‌వారం రాత్రి ఆమె ఛాతీ నొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో ఆమెను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అంథేరీలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతున్న ఆమె మ‌ర‌ణించారు. మ‌రాఠీ రంగ‌స్థ‌లం నుంచి బాలీవుడ్‌ కు వ‌చ్చిన రీమా దూర‌ద‌ర్శ‌న్ ధారావాహిక‌ల్లోనూ న‌టించారు.

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తొలిచిత్రం మైనే ప్యార్ కియా.. తెలుగులో ప్రేమ‌పావురాలుగా విడుద‌లై అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో స‌ల్మాన్ త‌ల్లిగా న‌టించిన రీమా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు విశేషంగా ఆక‌ర్షించారు. అప్ప‌టి తెలుగు సినిమాల్లో అమ్మ పాత్ర‌ల‌కు భిన్నంగా ఉన్న ఆమె పాత్ర‌తో పాటు.. అందులో ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది.

హ‌మ్ ఆప్కే హై కౌన్‌. కుచ్ కుచ్ హోతా హై.. హ‌మ్ సాత్ సాత్ మై.. క‌ల్ హోనా హో త‌దిత‌ర చిత్రాల్లో త‌ల్లిపాత్ర‌ల్ని పోషించిన ఆమె.. ప‌లు పాపుల‌ర్ టీవీ షాల‌లోనూ న‌టించారు. మ‌రాఠీ న‌టుడు వివేక్ లాగూను పెళ్లి చేసుకున్న ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. ఈ బాలీవుడ్ అమ్మ ఆక‌స్మిక మ‌ర‌ణంతో హిందీ చిత్ర‌రంగం షాక్ కు గురైంది. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆమె మృతికి సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News