డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలతో మూడు వారాలుగా జైల్లో ఉన్న ఆర్యన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరకడంతో షారుక్ తో పాటుగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆర్యన్ కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు.. ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇప్పించిన అతని తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ పై షారుఖ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై తనదైన శైలిలో కాస్త భిన్నంగా సెటైరికల్ గా స్పందించారు. ఆర్యన్ కు బెయిల్ రావడానికి ముకుల్ రోహత్గీ వాదనే కారణమైతే.. అంతకుముందు వాదించిన అసమర్థులా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. అమాయకపు ప్రజలు ముకుల్ వంటి కాస్ట్లీ లాయర్ ని నియమించుకోలేక జైళ్లలో మగ్గుతున్నారా? అని ట్వీట్ చేశారు.
''ఆర్యన్ కు బెయిల్ రావడానికి ముకుల్ రోహత్గీ వాదనను మాత్రమే కారణంగా తీసుకుంటే.. అతని తరపున వాదించిన మునుపటి లాయర్లు చాలా అసమర్థులా?.. అందుకే అతను అనవసరంగా ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా?'' అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మరో ట్వీట్ లో ''మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ వంటి ఖరీదైన లాయర్ ని నియమించుకోలేరు. కాబట్టి ఇది అండర్ ట్రయల్ కింద భారీ సంఖ్యలో అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్లు వివరిస్తుంది'' అని ఆర్జీవీ అన్నారు.
కాగా, ముంబయి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అక్టోబరు 3వ తేదీన అరెస్ట్ అయ్యాడు. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ క్రమంలో ముంబై హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో మూడు వారాలకు పైగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్.. రేపు శుక్రవారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఇక ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్యన్ బెయిల్ పై సెటైరికల్ ట్వీట్స్ వేశారు. కానీ ఇవి కూడా ఆలోచింపజేసేవిగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.