'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌కి ఆల్‌టైమ్ రికార్డ్‌

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ట్రైలర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుందని, వ్యూస్‌, లైక్స్‌ తో కుమ్మేస్తుంది అంటూ నెట్టింట అధికారికంగా ప్రకటించారు.

Update: 2025-01-04 07:24 GMT

రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా అంచనాలు పెంచుతూ తాజాగా ట్రైలర్ వచ్చేసింది. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి విడుదల చేసిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. రికార్డ్‌ స్థాయి వ్యూస్‌ను రాబడుతూ యూట్యూబ్‌తోనూ అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లోనూ దూసుకు పోతుంది. అన్ని భాషల్లోనూ యూట్యూబ్‌ ద్వారా ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా గేమ్‌ ఛేంజర్ ట్రైలర్‌ విడుదలైన విషయం తెల్సిందే. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ట్రైలర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుందని, వ్యూస్‌, లైక్స్‌ తో కుమ్మేస్తుంది అంటూ నెట్టింట అధికారికంగా ప్రకటించారు.


గేమ్ ఛేంజర్ సినిమా ఏకంగా 180 మిలియన్‌ల వ్యూస్‌తో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో ఏ సినిమా ట్రైలర్‌కి ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు అంటూ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఈ స్థాయిలో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. పైగా ట్రైలర్‌ కట్‌ బాగుండటం మాత్రమే కాకుండా బీజీఎంతో తమన్‌ అలరించాడు. అందుకే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది అంటూ మెగా ప్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌లో రెండు పాత్రల్లోనూ రామ్‌ చరణ్‌ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ట్రైలర్‌లోని రామ్‌ చరణ్‌ మాస్‌ లుక్‌, ముఖ్యంగా లుంగీ కట్టిన షాట్స్‌ను స్లో మోషన్‌లో చూసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో రామ్‌ చరణ్‌ ఏ స్థాయి పవర్‌ ఫుల్‌గా ఉంటాడు అనేది చూపిస్తూనే మంచి మెసేజ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ జంటగా ఈ సినిమాలో నటించారు. అంజలి ఈ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించిన చరణ్‌కి జోడీగా నటించింది. తమిళ స్టార్‌ దర్శకుడు కమ్‌ నటుడు అయిన ఎస్ జే సూర్య ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి. శంకర్ వింటేజ్ మూవీ అంటూ గేమ్‌ ఛేంజర్‌ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

రామ్‌ చరణ్‌ ఆర్ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాల తర్వాత రాబోతున్న సినిమా ఇదే అనే విషయం తెల్సిందే. నాలుగు ఏళ్ల క్రితం చరణ్ సోలో హీరోగా వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే సోలో హీరోగా చరణ్‌కి హిట్‌ లేక చాలా కాలం అయ్యింది. అందుకే ఈ సినిమాతో తన సత్తా ను చాటే విధంగా రామ్‌ చరణ్ దుమ్ము లేపడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్‌ కాంబోలో రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News