మిర్చి గాళ్‌.. మళ్ళీ చుక్కలు చూపించారు

Update: 2016-07-30 04:10 GMT
''మిర్చి'' సినిమా రిలీజైనప్పుడు ఎవ్వరికీ తెలియదు.. ఆ సినిమాయే హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ లాస్ట్ ఫిలిం అని. అమ్మడు ఏదో సరదాగా ఓ మూడు సంవత్సరాలు బ్రేక్ తీసుకుని.. అమెరికా నుండి ఇండియా వచ్చి.. ఇక్కడ సరదాగా యాక్టింగ్ చేసింది. అదే మన దేశంలోనే పెరిగిన పాపలైతే.. చిన్న చిన్న సినిమాలొచ్చినా కూడా అలాగే యాక్టింగ్ ఫీల్డులో కొనసాగిపోయేవారు. కాని అమ్మడు అమెరికాలో పుట్టి పెరిగిన లేడీ కాబట్టి.. చక్కగా అక్కడకు వెళ్ళి.. ఒక పెద్ద యునివర్సిటీలో మాష్టర్స్ చదువుతూ.. ఒక చిన్న రెస్టారెంటులో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. అమెరికా వాళ్ళ లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయిలే.

ఇప్పుడు మ్యాటర్ లోకి వెళితే.. ఈ భామకు మనోళ్ళు సినిమాలు చేయట్లేదేంటి అనే క్వశ్చన్ తో ఎప్పటికప్పుడు చుక్కలు చూపిస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా.. మానేసిందంటే నమ్మరు. ఇదంతా ఒకెత్తయితే తాజాగా ఈ బంగారం తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు సపోర్టు చేస్తున్నానని ప్రకటించింది. దానితో ఇండియాలో ఉన్న ఆమె ఫ్యాన్సు హర్టయ్యారు. నువ్వు ఇండియన్ అయ్యుండి.. ఎందుకిలా అమెరికా రాజకీయాల్లో వేలెడుతున్నావ్ అంటూ ఏకేశారు. నేను అమెరికన్ కదా బాబోయ్ అంటూ అమ్మడు గొంతు చించుకున్నా కూడా జనాలు వినలేదు. చివరకు.. అమ్మడు ఏమందంటే.. ''ఓ నాలుగు సంవత్సరాలు ఇండియాలో పనిచేసినంత మాత్రాన.. నేను అమెరికన్ కాకుండాపోను. అలాగే అమెరికాలో పుట్టి పెరిగినంత మాత్రాన ఇండియన్ కాకుండా పోను'' అంటూ లాజికల్ గా ఏదో చెబుతూ నిట్టూర్చింది.

నిజానికి అమ్మడు అమెరికన్ బార్న్ అమ్మాయి. ఇండియా దంపతులకు అమెరికాలో పుట్టి అమెరికాలోనే పెరిగిన అమ్మాయి. టెక్నికల్ గా ఆమె అమెరికన్. సో.. మన సినిమాల్లో చేసింది కాబట్టి మన ఇండియన్ అనుకోవడం మనోళ్ళ పిచ్చే మరి. ఇండియన్ సంతతికి చెందిన అమ్మాయే కాని.. ఇండియన్ కాదు నాయనలారా!!



Tags:    

Similar News