కలిసి కనిపిస్తే డేటింగేనా?

Update: 2017-10-01 04:32 GMT
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో రణ్ బీర్ కపూర్ పేరు ముందే ఉంటుంది. యంగ్ సూపర్ స్టార్ - రాజ్ కపూర్ వంశానికి వారసుడు అందగాడుగా పేరున్న రణ్ బీర్ పేరు ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈమధ్య కాలంలో హిట్ కోపం మొహంవాచేలా ఎదురుచూస్తున్నా అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.

రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ బార్బీ గర్ల్ కత్రినా చాలారోజులు డేటింగ్  చేశాడు. రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ కు ఇదే మాత్రం నచ్చకపోయికా కక్కలేక.. మింగలేక ఊరకుండిపోయాడు. దాదాపు అయిదేళ్ల తర్వాత వీరిద్దరి రిలేషన్ కు బ్రేక్ పడింది. దీంతో రిషి కపూర్ ఖుషీ అయిపోయాడు. అయితే రణ్ బీర్ తాజాగా పాకిస్తాన్ కు చెందిన హీరోయిన్ రయీస్ ఫేం మహీరా ఖాన్ తో డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈమధ్యే న్యూయార్క్ లో వాళ్లిద్దరూ కలిసి దమ్ము కొడుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొడుకు ను కవర్ చేయడానికి రిషి కపూర్ వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏం లేదంటూ కొట్టి పారేశాడు.

‘‘రణ్ బీర్  ఓ యాక్టర్. తన పనిలో భాగంగా ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటాడు. ఎంతోమందిని కలుస్తుంటాడు. ఏదో ఓ హీరోయిన్ తో ఒకచోట కలిసి కనిపించినంత మాత్రాన వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం సరికాదు. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే ఎక్కువ రోజులు దాచి ఉంచలేరు’’ అంటూ కొడుకును వెనకేసుకొచ్చాడు. ఇదంతా బాగానే ఉంది సెలబ్రిటీ అయి ఉండి కూడా ఇంకో హీరోయిన్ తో కలిసి పబ్లిగ్గా దమ్ము కొడుతూ దొరికిపోయినా ఏం లేదంటే ఎలా సారూ?
Tags:    

Similar News