భారతీయ చిత్రసీమ అంతటికీ అందాల సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి అర్ధంతరంగా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఊహకందని రీతిలో ఆమె కనుమరుగవడంతో ఎందరినో కలచివేసింది. ఒకింత బాధతో.. ఇంకొంత ఆవేదనతో చాలామంది వాళ్ల ఫీలింగ్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతోపాటు మీడియా కూడా శ్రీదేవి ఎలా మృతిచెందింది.. ఎప్పుడు అంత్యక్రియలు జరుగుతాయి లాంటి సమాచారం ఇవ్వడానికి తెగ ఆరాట పడింది.
శ్రీదేవికి సంబంధించి న్యూస్ కవరేజీలో టీవీ ఛానళ్లు వాడిన భాష ఒకప్పటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ కు తెగ కోపం తెప్పించింది. ‘‘బాడీ ముంబయికి రాత్రికి చేరుకుంటుంది’’ అంటూ అన్ని ఛానళ్లు రిపోర్టింగ్ చేశాయి. అంతగొప్ప శ్రీదేవి ఒక్కసారిగా ‘‘బాడీ’’ ఎలా అయిపోయింది. ’’ అంటూ తన ఆవేదనను సోషల్ మీడియా లో బయటపెట్టాడు. ఈ విషయంలో టీవీఛానళ్లు వాడిన పదజాలంలో పెద్దగా తప్పేం లేకపోయినా రిషికపూర్ కు మాత్రం తప్పని అనిపించింది. నెటిజన్లు కొంతమంది ఈ కామెంట్లను సమర్ధిస్తుంటే.. ఇంకొందరమేమో రిషికపూర్ తీరునే తప్పుపడుతున్నారు.
రిషికపూర్-శ్రీదేవి కలిసి జంటగా చాందిని.. నగీనా సినిమాల్లో నటించారు. ఈ రెండూ అప్పట్లో సూపర్ హిట్టయ్యాయి. శ్రీదేవికి బాలీవుడ్ లో పేరు తెచ్చిపెట్టాయి. ‘‘ఆమె సాధించినన్ని విజయాలు మరే హీరోయిన్ సాధించలేదు. చందమామ (చాందిని) శాశ్వతంగా దూరమైపోయిందంటూ’’ శ్రీదేవి మృతికి రిషి సంతాపం తెలిపారు.