2.ఓ బ‌డ్జెట్ అస‌లు లెక్క‌ ఇదీ

Update: 2018-10-29 13:13 GMT
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ - శంక‌ర్ - అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్ మూవీ 2.ఓ (రోబో 2) న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 3న ట్రైల‌ర్‌ ను రిలీజ్ చేస్తున్నారు. ఫిఫ్త్ ఫోర్స్ టు టేకోవ‌ర్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ చిత్రం గురించి ప్ర‌చారం సాగుతోంది. అదొక్క‌టే కాదు.. ఇండియాస్ బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీ ఇది. దాదాపు 500 కోట్లు పైగా బ‌డ్జెట్ వెచ్చించార‌ని మ‌రో ప్ర‌చారం హోరెత్తిపోతోంది. అయితే బ‌డ్జెట్ విష‌యంలో నిజం ఎంత‌? అస‌లు ఈ సినిమాకి బ‌డ్జెట్ ఎంత ఖ‌ర్చు చేశారు? అంటే క్లియ‌ర్ క‌ట్‌ గా తెలిసింది త‌క్కువే.

ర‌క‌ర‌కాల‌ వెబ్‌ సైట్ల‌లో ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమాకి 550 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగించాయి. అయితే ఈ బ‌డ్జెట్ లెక్క‌ల విష‌యంలో ప్ర‌ఖ్యాత బాలీవుడ్‌ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ కి చెందిన ప్ర‌ముఖ వెబ్‌ సైట్‌ ఓ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. 2.ఓ భారీ బ‌డ్జెట్ సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంత‌టా ప్ర‌చారం సాగుతున్న‌ట్టు 500కోట్లు ఖ‌ర్చు అవ్వ‌లేదు. ఈ సినిమ‌కి ఓవ‌రాల్‌గా 400కోట్లు బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింది. అది కూడా చెత్త వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఫెయిల్ అయ్యాక‌ - రెండోసారి ప‌ని చేయించాక అయిన బ‌డ్జెట్ ఇది.

ఈ బ‌డ్జెట్ లైకా సంస్థ రిక‌వ‌రీ చేసుకోవడం పెద్దంత క‌ష్ట‌మేమీ కాదు. అలానే ఈ సినిమా కంటెంట్ ప‌రంగానూ హై స్టాండార్డ్స్‌లో ఉంద‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. సౌతిండియాలో సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కి ఉన్న మార్కెట్ - ఇమేజ్ దృష్ట్యా బ‌డ్జెట్ రిక‌వ‌రీ సాధ్య‌మే. అయితే ర‌జ‌నీకి ఉత్త‌రాదిన మాత్రం మార్కెట్ ఏమంత లేదు. అయితే అక్ష‌య్ కుమార్ ఉండ‌డం వ‌ల్ల ఉత్త‌రాది బిజినెస్ ప‌రంగా క‌లిసొస్తోంది. ఇప్ప‌టికే 2.ఓ శాటిలైట్ ప‌రంగా 80 కోట్లు వ‌సూలు చేసింది. తెలుగు రైట్స్‌ - త‌మిళ్ రైట్స్ - హిందీ రైట్స్ ప‌రంగా బ‌డ్జెట్ ని చాలా వ‌ర‌కూ రిక‌వ‌రీ చేయ‌డం సాధ్య‌మేన‌ని స‌ద‌రు వెబ్ సైట్ పేర్కొంది.
   

Tags:    

Similar News