ప్రస్తుతం దేశం నలుమూలల్లో ఏ చోట విన్నా రాకింగ్ స్టార్ యష్ మాటే వినిపిస్తోంది. యష్ నటించిన తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2` ఇటీవల వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలనాలు సృస్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే వరుస రికార్డులు అధిగమిస్తూ ట్రేడ్ వర్గాలతో పాటు బాలీవుడ్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆల్ ఇండియా వైడ్ గా అత్యధికంగా డే వన్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రాలుగా బాలీవుడ్ మూవీస్ ప్రధానంగా నిలిచాయి. అయితే ఆ రికార్డుని `కేజీఎఫ్ 2` అధిగమించేసి షాకిచ్చింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ యస్ ని ప్రజెంట్ చేసిన విధానంగా, కథని టైట్ స్క్రీన్ ప్లేతో నడిపించిన తీరు మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఎలివేషన్స్ మాసీవ్‌గా వున్నాయి. యష్ ఇంట్రడక్షన్ సీన్ నుంచి రమికా సేన్ తో స్పెషల్ మీటింగ్ వరకు ప్రతీ సన్నివేశంలో హై లెవెల్ ఎలివేషన్స్ తో పిచ్చెక్కించారు. ఓ సూపర్ స్టార్ కు ఇచ్చిన స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వడం, అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో సందీత దర్శకుడు రవి బాస్రూర్ అందించిన బీజిఎమ్స్ సినిమాని ఓ లెవెల్ కు తీసుకెళ్లాయి.
ఇదే ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టడమే కాకుండా యష్ ని తిరుగులేని సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఇదే యష్ కు ఇబ్బందికరంగా మారబోతోందా? అంటే అవుననే అంటున్నారు. ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రతీ హీరోకు నెక్ట్స్ మూవీ ఓ ఛాలెంజ్ గా నిలుస్తుంటుంది. ఎందకంటే తరువాత సినిమా పై కూడా అదే తరహాలో అంచనాలుంటాయి కాబట్టి.
ఆ అంచనాలకు రీచ్ కాలేకపోతే దారుణ ఫ్లాప్ ని ఎదుర్కోవడం అనివార్యమే. ఇప్పడు యష్ ముందు కూడా ఇదే ఛాలెంజ్ కనిపిస్తోంది. `కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ రీసెంట్ గా విడుదలైన `కేజీఎఫ్ 2`తో మరింత క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తరువాత చేయబోయే సినిమా అంతకు మించి వుండాలి. కానీ కన్నడలో ఇమ్మిడియట్ గా ఆ స్థాయి సినిమాని అందించే దర్శకులు లేరు. ఇదే ఇప్పడు యస్ కు ప్రధాన సమస్యగా మారే అవకాశం వుందంటున్నారు.
టాలీవుడ్ లో వున్న టాప్ డైరెక్టర్లలో ఎవరైనా యష్ తో సినిమా చేస్తారా? అంటే ఎవరూ ఖాలీగా లేరు. `ట్రిపుల్ ఆర్` తరువాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ తో ఫిక్స్ అయ్యారు. ఇక మిగతా స్టార్ డైరెక్టర్ లు త్రివిక్రమ్ కూడా మహేష్ కోసమే ఎదురుచూస్తున్నాడు. కొరటాల శివ .. ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. పూరి.. విజయ్ దేవరకొండతో... శంకర్ .. చరణ్ తో .. ఇలా టాప్ డైరెక్టర్స్ అంతా క్రేజ్ డైరెక్టర్లతో సినిమాలని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో యష్ తో తదుపరి సినిమా చేయబోయే దర్శకుడు ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.