జూనియ‌ర్ ఆతిథ్యాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేను!

Update: 2022-04-13 15:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేన‌ని అన్నారు కేజీఎఫ్ స్టార్ య‌ష్‌. అలాగే ఎన్టీఆర్ తల్లిగారితో ఉన్న ప్రత్యేక బంధాన్ని యష్ స్వ‌యంగా వెల్లడించారు. KGF: చాప్టర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా అన్ని న‌గ‌రాల్ని చుట్టేస్తున్న రాకింగ్ స్టార్ యస్ ఇంత‌కుముందు హైదరాబాద్ లో తన మూవీకి ప్ర‌చారం సాగించాడు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- త‌న‌కు కొంతమంది తెలుగు స్టార్ల‌తో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నారని వెల్లడించారు. RRR స్టార్ల‌ రామ్ చరణ్  జూనియర్ ఎన్టీఆర్ ల‌తో త‌న‌కు గొప్ప స్నేహం ఉంద‌ని తెలిపారు. RRR చిత్రం సాధించిన విజ‌యం గురించి గొప్పగా మాట్లాడిన యష్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నంత‌సేపూ ప్ర‌తి స‌న్నివేశానికి తాను థ్రిల్ అయ్యానని వెల్లడించాడు.  షూటింగ్ ల‌కు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పంపుతుంటాడు అని యష్ వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి యష్ మాట్లాడుతూ తాను రెండుసార్లు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లానని చెప్పాడు. ఎన్టీఆర్ తనని వ్యక్తిగతంగా డిన్నర్‌కి ఆహ్వానించార‌ని తన కుటుంబం ముఖ్యంగా తన తల్లి గారి మాతృత్వ దీవెన గొప్ప‌గా ఉందని యష్ చెప్పాడు. ఎన్టీఆర్ కుటుంబం ఇచ్చిన‌ ఆతిథ్యాన్ని నా జీవితాంతం మర్చిపోలేను... అని అన్నారు.

ఎన్టీఆర్ తల్లి ప్రత్యేకించి ఎంతో ఆత్మీయురాలు.. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. మా బంధం మరింత బలపడటానికి కన్నడ అంశం సహాయపడిందని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందిన వారు కాబట్టి నాతో బాగా మాట్లాడారు.. అంటూ క‌న్న‌డ క‌నెక్టివిటీని యష్ నొక్కి చెప్పారు. య‌ష్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కెజిఎఫ్: చాప్టర్ 2 ఏప్రిల్ 14న భారీ స్క్రీన్ లలో విడుదల కానుంది. తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డ - మ‌ల‌యాళంలో ఈ చిత్రం అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.
Tags:    

Similar News