'RRR' ఫ‌స్ట్ రివ్యూ స్పాట్ ఫిక్సైంది!

Update: 2022-03-22 15:30 GMT
పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వ‌డంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సినిమా ఎలా ఉంటుంది?  రామ్-భీమ్ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుంది? ఎవ‌రు ది బెస్ట్ అనిపిస్తారు?  ఎలాంటి టాక్ రాబోతుంది?  వంటి  ప్ర‌శ్న‌లు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

తెలుగు రాష్ర్టాల్లో సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ముందే బెనిఫిట్ షోలు ప‌డుతున్నాయి. హైద‌రాబాద్ లో  ఏడు థియేట‌ర్ల‌లో  స్పెష‌ల్  షోలు ఏర్పాటు చేసారు. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ప‌లు థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు ప‌డుతున్నాయి. ఏపీలో ఐద‌వ ఆట‌కి అనుమ‌తి ఉంది. కానీ స‌మయం ఇంకా నిర్ణయించ‌లేదు. ఈనేప‌థ్యంలో షో టైమింగ్ ఇంకా డిసైడ్ కాలేదు. ఇక తెలంగాణ‌లో మాత్రం 25 వ‌తేదీ ఉద‌యం 1 గంట‌కు మొద‌టి షో ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ షో టిక్కెట్ ధ‌ర భారీగా అమ్మ‌డు పోతుంది. 3000-5000 వ‌ర‌కూ  టిక్కెట్ ధ‌రగా నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది. అమెరికాలోనూ పెద్ద ఎత్తున ప్రీమియ‌ర్ ఏర్పాటు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆషోకి సంబంధించి  అడ్వాన్స్ బుకింగ్స్ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే మొద‌టి రివ్యూ.. సినిమా టాక్  యాధావిధిగా అమెరికా నుంచే ముందుగా రాబోతుంది. U.S.లో మొదటి షో 11.30 ISTకి ప్రసారం చేయబడుతుంది.

కాబ‌ట్టి  `ఆర్ ఆర్ ఆర్` ఫ‌స్ట్ రివ్యూ అమెరికా నుంచే వ‌స్తుంది. సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది? అమెరికా టాక్ ద్వారా ముందుగానే తెలుస్తుంది. లైవ్ లోనే ఎప్ప‌టిక‌ప్పుడు సినిమాకి సంబంధించిన ఫీడ్ బ్యాక్ వ‌చ్చేస్తుంది. రివ్యూ సైతం షో ముగిసిన త‌క్కువ వ్య‌వ‌ధిలోనే వెబ్ సైట్స్ లో  లైవ్ అవుతుంటాయి.

గ‌తంలో `బాహుబ‌లి` సినిమాకి ఇలాగే జ‌రిగింది. రివ్యూలు నైట్ కి నైటే  వ‌చ్చేసాయి. మ‌ళ్లీ `ఆర్ ఆర్ ఆర్` విషయంలో అదే స‌న్నివేశం రిపీట్ కానుంది. `బాహుబ‌లి`కి యూఎస్ వెబ్ సెట్స్ మంచి రేటింగ్స్ ఇచ్చాయి. మ‌రి ఆ కోవ‌లో `ఆర్ ఆర్ ఆర్` నిలుస్తుందా?  ఇంకేదైనా జ‌రుగుతుందా? అన్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో  తేలిపోతుంది..
Tags:    

Similar News