రామ్ చరణ్ 16.. స్క్రిప్ట్ కోసం గట్టిగానే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఒక విధంగా గేమ్ ఛేంజర్ కంటే ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. RC16 చిత్రానికి సంబందించిన తాజా టాక్ ప్రకారం, సినిమా స్క్రిప్ట్‌పై మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కథ రాయడానికే ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చిస్తున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ కోసం అనుభవజ్ఞులైన రచయితల బృందం పనిచేస్తోందట. ప్రస్తుతం, సీనియర్ రైటర్స్ టీమ్ స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచడం కోసం శ్రమిస్తోంది. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ముందు స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేయాలని మేకర్స్ కృషి చేస్తున్నారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇక ఆర్ సి 16కి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల కోసం సెట్స్, లొకేషన్ల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో విశేషం ఏమిటంటే, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశారట. రెహమాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన వృద్ది సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సుకుమార్ రైటింగ్స్ సహకారాన్ని అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సమర్పకులుగా ఉన్నారు. ఈ భారీ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం సినిమా స్థాయిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారని, అతని పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. బుచ్చిబాబు సాన ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచిన దర్శకుడు. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేసే ఈ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు ఉన్నాయి. సుకుమార్‌తో కలిసి పని చేయడం ద్వారా, ఈ సినిమా కథను మరింత ఆసక్తికరంగా మలచబోతున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇక సినిమా షూటింగ్‌కి ముందు లొకేషన్‌లు, పాత్రలు, సన్నివేశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.