#RRR వ‌డ్డీ క‌లిపితే బ‌డ్జెట్ త‌డిపి మోపెడు

Update: 2021-09-17 03:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్.ఆర్.ఆర్` భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం  దాదాపు 400 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ అదే మొత్తాన్ని వ‌డ్డీ క‌లిపితే మ‌రో 150 కోట్లు అద‌నంగా ఖ‌ర్చు  అయింద‌ని స‌మాచారం. కోవిడ్ స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌. మొత్తంగా ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్ 550 కోట్లు అయింద‌ని  ప్ర‌చారం సాగుతోంది. ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజవుతున్న‌ చిత్రం.  ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగు-హిందీలో మాత్రమే తెర‌కెక్కించారు. మిగ‌తా భాష‌ల్లో అనువాద‌మ‌వుతుంది. అంటే దాదాపు స్వ‌దేశంలో అన్ని భాష‌ల్లోనూ ఆర్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతోంది.

ఇంకా ఇతర దేశాల్లో `బాహుబ‌లి` త‌ర‌హాలోనే అనువాదం కానుంది. అంటే ఈ లెక్క‌న బాక్సాఫీస్ బ‌రిలోకి 1000 కోట్ల పైబ‌డిన వ‌సూళ్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగాలి. అప్పుడే ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్... లాభాలు ఆశించ‌డానికి అవ‌కాశం ఉంది. మ‌రి ఆ ర‌కంగా చూస్తే సినిమాకు అంత స్టామినా ఉందా? అంటే కాస్త రిస్క్ జోన్ లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎంత బ‌ల‌మైన స్క్రిప్ట్ అయినా హీరోల మార్కెట్ కూడా ఇక్క‌డ అత్యంత కీల‌కంగా మారాల్సి ఉంది. మ‌రి చ‌ర‌ణ్‌.. తార‌క్ బాక్సాఫీస్ స్టామినా ఎంట‌న్న‌ది మ‌రోసారి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌నే అనాలి. ఇక ఈ చిత్రం హిందీ రైట్స్ ..శాటిలైట్ రైట్స్  పెన్ స్టూడియోస్ కి క‌ట్ట‌బెట్టారు. పోర్చుగీస్..కొరియ‌న్..ట‌ర్కీష్‌.. స్పానిష్ భాష‌ల డిజిట‌ల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ కి అమ్మేసారు.

తెలుగు..త‌మిళం..క‌న్న‌డం..మ‌ల‌యాళం డిజిట‌ల్ హ‌క్కుల్ని జీ-5కి క‌ట్ట‌బెట్టారు. ఎన్నికోట్ల‌కు ఇప్ప‌టివ‌కూ బిజినెస్ జ‌రిగింద‌న్న‌ది తేలాల్సి ఉంది. అయితే 550 కోట్ల బ‌డ్జెట్ న‌డుమ ద‌ర్శ‌క‌..నిర్మాత‌లపై తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని గుసుగ‌సు వినిపిస్తోంది. సినిమాను కోనుగోలు చేసిన ప్ర‌తీ ఒక్క‌రు లాభ‌ప‌డితేనే సినిమా హిట్ కింద లెక్క‌. ఆ లెక్క‌లో ఎక్క‌డా తేడా జ‌రిగినా బాక్సాఫీస్ లెక్క‌లు మారిపోయే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై డైల‌మా క్లియ‌ర్ కావాల్సి ఉంది. ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ కి వ‌స్తుంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత 2022లోనే వ‌స్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.
Tags:    

Similar News