ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్ అవుతున్న `ఆర్ ఆర్ ఆర్` హిందీ బెల్డ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. 2డీతో పాటు 3డీ ఫార్మెట్ లోనూ అన్ని చోట్లా భారీ ఎత్తున మార్చి 25న రిలీజ్ అవుతుంది. తెలుగు నుంచి ఈ సినిమాకి పోటీగా మరే సినిమా లేదు. `ఆర్ ఆర్ ఆర్` వేడి చల్లారేంత వరకూ ఏ హీరో పోటీగా రాడు. కాబట్టి ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. తెలుగు మార్కెట్ తర్వాత హిందీ మార్కెట్ లోనే `ఆర్ ఆర్ ఆర్` బిగ్ స్కేల్ లో రిలీజ్ అవుతుంది.
మరి అక్కడ `ఆర్ ఆర్ ఆర్` పరిస్థితి ఏంటి? అంటే? అక్కడ ప్రధానంగా `కశ్మీర్ ఫైల్స్` పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సాధించింది. `కశ్మీర్ ఫైల్స్` దెబ్బకి బాలీవుడ్ స్టార్ హీరోలే తోక ముడవాల్సిన సన్నివేశం ఎదురైంది. మార్చి 11న రిలీజ్ అయితే `కశ్మీర్ ఫైల్స్` ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నింటి బీట్ చేసింది.
ముఖ్యంగా అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన `బచ్చన్ పాండే` భారీ అంచనాల మధ్య మార్చి 18న రిలీజ్ అయింది. కానీ నెగిటివ్ టాక్ రావడం తో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో కొన్ని థియేటర్లని `కశ్మీర్ ఫైల్స్` ఆక్యుపై చేసింది. ఆ రకంగా `బచ్చన్ పాండే` పై కొంత ప్రభావం పడింది. వాస్తవానికి `బచ్చన్ పాండే` -`ఆర్ ఆర్ ఆర్` మధ్య పోటీ ఉంటుందని ముందు ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ సీన్ తారుమారైంది. `కశ్మీర్ ఫైల్స్` నుంచి `ఆర్ ఆర్ ఆర్` గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
`ఆర్ ఆర్ ఆర్` అక్కడ తొలి షోతోనే మంచి టాక్ వస్తే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లే. థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే `కశ్మీర ఫైల్స్` హవా యధావిధిగా కొనసాగుతుంది. ఇక `ఆర్ ఆర్ ఆర్ ` బచ్చన్ పాండే నుంచి రెండు వారాల పాటు థియేటర్ వద్ద పోటీ పడాల్సి ఉంటుంది. `బచ్చన్ పాండే` కి నెగిటివ్ టాక్ రావడంతో ఓటీటీలోకి అనుకున్న దానికంటే రెండు వారాలు ముందుగానే వచ్చేస్తుంది.
లేదంటే `బచ్చన్ పాండే `- ఆర్ ఆర్ ఆర్ పై కొంత ప్రభావం చూపించేది. వాస్తవానికి `బచ్చన్ పాండే` కారణంగా `ఆర్ ఆర్ ఆర్` వాయిదా పడుతుందని ప్రచారం సాగింది. పాండే మెప్పించకపోవడంతో `ఆర్ ఆర్ ఆర్` లైన్ క్లియర్ అయింది. కానీ కశ్మీర్ ఫైల్స్ నుంచి మాత్రం పోటీ తప్పదు.