'ఆర్ ఆర్ ఆర్‌' ఎన్ ఎఫ్ టీ అంటే ఏంటీ?

Update: 2022-03-21 14:30 GMT
దేశం మొత్తం ఇప్పుడు ఏ మూల విన్నా ఆర్ ఆర్ ఆర్ గురించే వినిపిస్తోంది. అంత‌గా ఈ మూవీ మేనియా న‌డుస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్థాయి డైరెక్ట‌ర్ గా మారిన రాజ‌మౌళి ఈ మూవీతో మ‌రే అద్భుతం చేయ‌బోతున్నారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌త కొంత కాలంగా రిలీజ్ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని నిర్వ‌హించ‌డం మొద‌లు పెట్టారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డ మీడియాతో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా ప్ర‌త్యేక ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, గుజ‌రాత్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసి చిత్ర బృందం తాజాగా మ‌రి కొన్ని న‌గ‌రాల‌కు ప‌యన‌మైంది.

ఇదిలా వుంటే ఈ చిత్ర ప్ర‌చారంలో భార‌త్ లోనే అతిపెద్ద మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ దిగ్గ‌జం పీవీఆర్ కూడా చేరింది. తొలి సారిగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ చైన్ విధానాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వ‌ర‌కు త‌మ థియేట‌ర్ల పేర్ల చివ‌ర‌లో `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా పేరుని చేర్చిన పీవీఆర్ గ్రూప్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం స‌రికొత్త ప్లాన్ తో వ‌చ్చింది. తొలి సారిగా భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌కు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్ ఎఫ్ టీ ( నాన్ ఫింజిబుల్ టోకెన్స్‌) క‌లెక్ష‌న్ ల‌ను గెలుచుకును అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లుగా పీవీఆర్ ప్ర‌క‌టించింది.    

డీవీవీ   ఎంట‌ర్ టైన్ మెంట్ . పీవీఆర్ సంయుక్తంగా ఈ ఎన్ ఎఫ్ టీ ల‌ని ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో వుంచ‌నుంది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అలియాభ‌ట్ సంత‌కం చేసిన పోస్ట‌ర్లు, సినిమాలో వాడిన ప‌లు వ‌స్తువులతో స‌హా దాదాపు 300ల‌కు పైగా ఎన్ ఎఫ్ టీలు అందుబాటులో వుండ‌నున్నాయి. ఈ డిజిట‌ల్ క‌లెక్ష‌న్ల‌ను పీవీఆర్ నిర్వ‌హించే పోటీలో ప్రేక్ష‌కులు సొంతం చేసుకోవ‌చ్చు అని పీవీఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

అంతే కాకుండా పాత చిత్రాల‌ను కూడా ఎన్ ఎఫ్ టీ క‌లెక్ష‌న్ ల రూపంలో అందించేందుకు పీవీఆర్ డీల్ కు  సిద్ధ‌మ‌ని పీవీఆర్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సంజీవ్ కుమార్ బిజిలీ తెలిపారు. గ‌త ఏడాది ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పీవీఆర్ బిగ్ డీల్ ని కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.

ఈ డీల్ లో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల పేర్ల‌ని PVRRR గా మార్చేశారు. సినిమా రిలీజ్ వ‌ర‌కు ఈ పేరు ఇలాగే వుంటుంద‌ని, ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే ఓ సినిమాతో మల్టీప్లెక్స్ చైన్ ఇలాంటి డీల్ ని కుదుర్చుకోవ‌డం ఇదే మొట్ట‌మొద‌టి సారి కావ‌డం విశేషం.
Tags:    

Similar News