అట్లుంటది మన 'ఆర్.ఆర్.ఆర్'తోని..!

Update: 2022-03-21 17:30 GMT
ఇండియాలో మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ''ఆర్.ఆర్.ఆర్'' విడుదలకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో RRR మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు మెగా - నందమూరి ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ఇరు వర్గాలు ఇప్పటికే బ్యానర్స్ - కటౌట్స్ తో హంగామా షురూ చేశారు.

ఈ క్రమంలో అభిమానులను అదుపు చేసేందుకు.. తమ థియేటర్లను కాపాడుకోవడానికి యాజమాన్యాలు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. థియేటర్ స్క్రీన్ వద్దకు అభిమానులు ఎవ్వరూ రాకుండా మేకులను ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చకు తెరలు చిరిగిపోవడం.. కుర్చీలు విరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇవి యజమానులకు అదనపు నష్టాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు RRR సినిమా విడుదల నేపథ్యంలో నందమూరి మెగా ఫ్యాన్స్ పోటాపోటీగా ఉన్నారు.

నువ్వా నేనా అంటూ కయ్యానికి కాలుదువ్వే పరిస్థితి ఉంది. అది ముందే ఊహించిన థియేటర్ల ఓనర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‏లో స్క్రీన్ దగ్గరకు వెళ్లకుండా పోడియంపై మేకులు బిగించారు. అలాగే మరో థియేటర్‏లో స్క్రీన్ ముందు కంచె బిగించారు.

RRR సినిమా రిలీజ్ రోజు థియేటర్ ముందు డ్యాన్సులు చేసి గోల చేయాలనుకునే అభిమానులకు ఇది షాక్ ఇచ్చే నిర్ణయమనే చెప్పాలి. మరి ఈ థియేటర్లో సినిమా చూసి చరణ్ - తారక్ ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చూస్తారో చూడాలి.

చరిత్రలో కలిసారో లేదో తెలియని ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ లను 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ - రాంచరణ్ లతో పాటుగా అజయ్ దేవగణ్ - అలియా భట్ - శ్రియా సరన్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Tags:    

Similar News