2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తాజా సన్నివేశం ఏమిటి? సెకండ్ వేవ్ భయాల నడుమ ఈ సినిమా సవ్యంగా చెప్పిన తేదీకే రిలీజవుతుందా? అందుకు జక్కన్న సర్వం సిద్ధం చేస్తున్నట్టేనా? వీఎఫ్ ఎక్స్ పనులు ఎంతవరకూ వచ్చినట్టు? ఇలాంటి కొన్ని చిక్కు ప్రశ్నలకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి సమాధానం రావాల్సి ఉంది.
తాజా సమాచారం మేరకు.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విషయంలో రాజమౌళికి అస్సలు టెన్షన్ లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ లో కొన్ని షాట్లు మినహా రీషూట్లు కూడా పూర్తయ్యాయి. ప్రీరిలీజ్ బిజినెస్ సవ్యంగానే పూర్తవ్వడంతో ప్రాఫిట్స్ కూడా వచ్చాయని కథనాలు వెలువడ్డాయి. ఆలియా-చరణ్ జంటపై కొంత చిత్రీకరణ పెండింగ్ ఉంది. అయితే కరోనా భయాల నడుమ రిలీజ్ తేదీపైనా టెన్షన్ పడాల్సినదేమీ లేదని మంచి రిలీజ్ తేదీకే వస్తామనే ధీమా జక్కన్నలో ఉందట.
ఎటొచ్చీ వీఎఫ్ ఎక్స్ తోనే చిక్కులు. విజువల్ గ్రాఫిక్స్ ఈ సినిమాకి ఎంతో కీలకం. అయితే ఇప్పటికి పూర్తయిన పనిపై రాజమౌళి పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో రీవర్క్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న పక్కా పర్ఫెక్షనిస్ట్. అందుకే ప్రతిదీ నిశితంగా పరిశీలించి రీవర్క్ చేయిస్తున్నారని తెలిసింది. అలాగే తాను మరోసారి రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వడం ద్వారా డెడ్ లైన్ ప్రకారం ప్రతిదీ పూర్తి చేయాలని ఒత్తిడి పెంచనున్నారట. ఆయన మాత్రం ప్రస్తుతానికి టెన్షన్ లో లేరు. తన టీమ్ ని టెన్షన్ పెట్టే పనిలో ఉన్నారు తప్ప. ఈ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నామని ఇంతకుముందు టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు-తమిళం- మలయాళం-హిందీ సహా దాదాపు 10 భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఎన్టీఆర్- రామ్ చరణ్ - ఆలియాభట్ - అజయ్ దేవగన్ తదితరులు నటించారు. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.