ఈరోజుల్లో క్రేజును నిర్ణయించేది డిజిటల్ లైక్ లు క్లిక్ లు మాత్రమేనా? ఒక సినిమాకి ఎంత క్రేజు ఉందో తెలుసుకునేందుకు యూట్యూబ్ లేదా సోషల్ మీడియాల్లో లేదా బుక్ మై షో టీజర్లలో దక్కిన ఆదరణ ప్రామాణికమా? అంటే కొంతవరకూ ఇవి ప్రామాణికాలు. కానీ ప్రతిసారీ ప్రదర్శించిన కంటెంట్ ని బట్టి టైమింగును బట్టి క్రేజు మారుతూనే ఉంటుంది.
ఒక్కోసారి అధిక భాషల్లో దక్కే పాపులారిటీకి ఈ లైక్ లు క్లిక్ లు ఆధారంగా భావించాల్సి ఉంటుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కి .. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2 కి సౌత్ తో పాటు అటు ఉత్తరాదినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలకు సంబంధించిన ప్రచారం ఎత్తుగడల్లో సౌత్ తో పాటు ఉత్తరాది కూడా ఒక భాగం. ఇప్పటివరకూ ఇరు సినిమాల నుంచి పోస్టర్లు టీజర్లు వచ్చాయి. అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. కానీ వేటికి ఎక్కువ ఆదరణ దక్కింది అంటే...
పోటీ జాబితాలో బుక్ మై షో బుకింగ్ సైట్ లోని లైక్ లను పరిశీలిస్తే... `కేజీఎఫ్: చాప్టర్ 2` బుక్ మై షో సైట్ లో ఇప్పటికే 300 కె లైక్ లను అధిగమించింది. ఇది సినిమా చూడటానికి ఆసక్తి ఉన్నవారి సంఖ్యను సూచిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో పోల్చితే 65.6 కె లైక్ లు అదనం. ఈ రెండింటి మధ్య అంతరం సినిమాలకు సంబంధించిన హైప్ లో అసమానతను వ్యక్తపరుస్తోంది.
అయితే ఇదే ప్రామాణికమా? అంటే కానేకాదు.. ఇది కేవలం ఒక కోణం మాత్రమే చూపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్.ఆర్.ఆర్ పై హైప్ అసాధారణం. కానీ ఉత్తరాది వరకూ వెళితే ఆర్.ఆర్.ఆర్ కంటే కేజీఎఫ్ 2పై ఎక్కువ క్లిక్ లు పడుతున్నాయా? అన్నది ఒక ఊహాగానం.
ఆర్.ఆర్.ఆర్ టీజర్ ఇంతకుముందు లాంచ్ చేయగానే అసాధారణంగా దూసుకెళ్లింది. భీమ్ క్యారెక్టర్ ఇంట్రో టీజర్ 50 మిలియన్ వ్యూస్ దాటింది. రెండు టీజర్ వీడియోలు 40 మిలియన్లకు పైగా వీక్షణలను కలిగి ఉండటం ఒక రికార్డ్. అయితే కేజీఎఫ్ 2 టీజర్ అందుకు ధీటుగా అంతర్జాలంలో దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. నిజానికి కేజీఎఫ్ 2 కంటే దర్శకధీరుడి ఆర్.ఆర్.ఆర్ నుంచి ఎక్కువ ఆశిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోందని కొన్ని ప్రూఫ్ లు కనిపిస్తున్నాయి.
కేజీఎఫ్ 2తో పోలిస్తే ఆర్.ఆర్.ఆర్ ఇంకా ఎక్కువ హైప్ తో సంచలనాలు సృష్టించాలనే చరణ్-తారక్ అభిమానులు కోరుకుంటారు. అయితే ఈ రెండు సినిమాల ట్రైలర్లు చాలా మారుస్తాయి. ఇవి రెండూ రెండు విభిన్నమైన జానర్ సినిమాలు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ హైప్ తక్కువ అయ్యి ఉండొచ్చు. కానీ దానిని పెంచేందుకు ఎత్తుగడలు జక్కన్న టీమ్ కి ఉన్నాయి. కేజీఎఫ్ 2 కి హైప్ ఇంకా పెంచేందుకు వారి ఎత్తుగడలు వారికి ఉంటాయి. అయితే ప్రతిదీ ట్రైలర్ల రాకతో మారుతుందని భావించాల్సి ఉంటుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ ని లో ప్రొఫైల్ లో ఉంచకుండా మరింత ప్రమోషనల్ మెటీరియల్ ని దించాల్సి ఉంటుందని ఒక సెక్షన్ అభిప్రాయపడుతోంది.