మహేష్ సినిమాపై లేటెస్ట్ రూమర్స్

Update: 2017-04-06 05:42 GMT
మహేష్ బాబు- మురుగదాస్ సినిమా చాలా కాలంగా తెరకెక్కుతూనే ఉంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి 10 నెలలు కావస్తోంది. జనవరి నాటికే షూటింగ్ అయిపోతుందని.. ఫిబ్రవరి నుంచి మహేష్ తర్వాతి సినిమా షూటింగ్ మొదలుపెట్టేస్తాడని అన్నారు కానీ.. కొన్నివారాల క్రితమే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాలంటూ రకుల్ చెప్పేసింది.

ప్రస్తుతం మురుగ అండ్ మహేష్ టీం.. షూటింగ్ పూర్తి చేసేందుకు తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు. ఓ వారం క్రితం చెన్నైలో షూటింగ్ చేయగా.. ఆ తర్వాత ఫారిన్ వెళ్లి మళ్లీ ఓ వారం పాటు షూటింగ్ పూర్తి చేసుకువచ్చారు. మళ్లీ చెన్నైలో షూటింగ్ మొదలుపెట్టడంతో.. సినిమాలో కొన్ని సీన్స్ సరిగా రాలేదని.. వాటిని మహేష్ రీషూట్ చేయమన్నాడని.. అందుకే ఇలా చకచకా చక్కర్లు కొడుతూ ఆయా సీన్లను కంప్లీట్ చేస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి.

అయితే వీటిని మురుగదాస్ టీం ఖండిస్తోంది. షూటింగ్ అంతా షెడ్యూల్ ప్రకారమే.. ముందుగా ప్లానింగ్ చేసిన ప్రకారమే జరుగుతోందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఒక్క ఫ్రేమ్ కూడా రీషూట్ చేయాల్సిన అవసరం రాలేదన్నది వీరి వాదన. ఇక ఏప్రిల్ 14న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందనే టాక్ ఉంది కానీ.. యూనిట్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో.. అది కూడా ఖాయమని చెప్పడం కష్టమే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News