ప్రభాస్ పెళ్లి పై షాకింగ్ రూమర్

Update: 2018-04-09 07:43 GMT
ప్రస్తుతం కొన్ని మీడియా ఛానెల్స్ లో రూమర్స్ ఏ విధంగా వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ విషయం అయినా సరే లోకల్ మీడియా జస్ట్ అనుకుంటోంది అని చెబితే అంటే చాలు నేషనల్ మీడియాలో మాత్రం ఫిక్స్ అయిపోయారు అని చెప్పేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ మీడియాలలో ఇదే తరహా వార్తలు వస్తున్నాయి. మొదట ప్రభాస్ - అనుష్క ల మధ్య ప్రేమ పెరిగిందని పెళ్లి కూడా జరగబోతోందని దేశమంతటా వార్తలు వచ్చాయి.

దీంతో ఫైనల్ గా ప్రభాస్ అనుష్క మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి బ్రేక్ పడింది. అయితే ఎవరు ఉహించని విదంగా నేషనల్ మీడియాలో ఈ మధ్య మరొక రూమర్ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభాస్ తో మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి జరుగనుందని అక్కడి మీడియాలలో టాక్ వచ్చింది. కొందరైతే ఫిక్స్ అయిపోయిందని కూడా పేర్కొనడం గమనార్హం. ఇక మరికొందరు అలాంటిదేమి లేదని చిన్నగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం నిహారిక తన కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో ఉందని పెళ్లి చేసే ఆలోచన లేదనే విధంగా చిరంజీవి క్లారిటీ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం వారానికో రూమర్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. అసలే బాహుబలి తరువాత అందరి చూపు మనోడి పైనే పడింది. ప్రభాస్ ఫ్యామిలీ ఆందోళన చెందకుండా ఉండాలంటే తొందరగా ప్రభాస్ కి కాబోయే ఆ లక్కీ గర్ల్ ని పట్టేయాలి. చూద్దాం ఎవరొస్తారో..
Tags:    

Similar News