'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ మొన్నటి దాకా ఎంజాయ్ చేసిన సుప్రీమ్ హీరో సాయి తేజ్.. ప్రస్తుతం 'ప్రస్థానం' దేవా కట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై ఈమధ్య అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు రిపబ్లిక్ డేని పురస్కరించుకుని 'SD14' టైటిల్ ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'తుపాకీ డాట్ కామ్' ఇది వరకే వెల్లడించినట్లుగానే ఈ చిత్రానికి ''రిపబ్లిక్'' టైటిల్ నే చిత్ర యూనిట్ ఖరారు చేశారు.
''ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులను ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్'' అంటూ సాయి తేజ్ చెప్పే వాయిస్ ఓవర్ తో మోషన్ పోస్టర్ ని కూడా వదిలారు. శాసన కార్య నిర్వాహక మరియు న్యాయవ్యవస్థ కలసి సక్రమంగా పని చేయడమే అసలైన రిపబ్లిక్ అంటూ చెప్తున్న 'రిపబ్లిక్' పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు - రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. 'రిపబ్లిక్' చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Full View