‘నక్షత్రం’లో తేజు కోసం వెయిట్ చెయ్యాల్సిందే

Update: 2017-05-08 08:32 GMT
ఒకప్పుడు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీసిన విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ దశాబ్దం నుంచి ఫామ్‌లో లేడు. ఆయన నుంచి చాలా చెత్త సినిమాలు వచ్చాయి గత కొన్నేళ్లలో. ఆయన చివరగా తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడాయన ఆశలన్నీ ‘నక్షత్రం’ మీదే ఉన్నాయి. కానీ ఈ సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యం కావడంతో దీనిపై ముందున్నంత హైప్ లేదు. సినిమా గురించి నెగెటివ్ వార్తలు ఎక్కువైపోవడంతో ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే హీరో సందీప్ కిషన్ కూడా ఫాంలో లేని నేపథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ వస్తుందా అని సందేహిస్తున్నారు. ఇందులో అతిథి పాత్ర చేసిన సాయిధరమ్ తేజ్ మీదే కృష్ణవంశీ అండ్ కో ఆశలు పెట్టుకుంది. అతనే ఈ సినిమాకు క్రేజ్ తీసుకొస్తాడని నమ్ముతోంది.

ఐతే తేజు మీద మెగా అభిమానులు మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నా కష్టమేనని సమాచారం. ఈ సినిమాలో తేజు కనిపించేది అరగంటే. అందులోనూ అతను ప్రథమార్ధంలో కనిపించనే కనిపించడట. అతడి పాత్ర ద్వితీయార్ధంలోనే కథలోకి ప్రవేశిస్తుందట. అంటే సినిమా మొదలైన దగ్గర్నుంచి మెగా అభిమానులు తేజు ఎప్పుడొస్తాడా అని చాలా సేపు వెయిట్ చెయ్యాలన్నమాట. ఐతే కథలో మాత్రం తేజు పాత్ర కీలకంగా ఉంటుందట. తేజు పాత్ర ఉన్నంత సేపూ సినిమా ఆసక్తికరంగా సాగుతుందని.. ఆ పాత్ర విషయంలో కృష్ణవంశీ ఒకప్పటి తన టచ్ చూపించాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. యువ కథానాయకుడు తనీష్‌ నెగెటివ్ రోల్ చేస్తుండటం విశేషం. ఆ పాత్ర కూడా బాగుంటుందని అంటున్నారు. ఈ నెలాఖరులో కానీ.. జూన్ తొలి వారంలో కానీ ‘నక్షత్రం’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News