సాయిపల్లవి వ్వావ్ అనిపించే స్మైలీ ట్రెడిషనల్ లుక్
అందాల కథానాయిక సాయిపల్లవి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటి డ్యాన్సర్ సింగర్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ కొరియోగ్రాఫర్ గానూ పలు చిత్రాలకు పని చేశారు. ఇక సాయిపల్లవి ఏ సినిమాలో నటించినా అందులో తనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కేవలం తనని చూసి మాత్రమే సినిమాకు బిజినెస్ సాగుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి క్రేజ్ వేరొక కథానాయికకు సాధ్యం కాదు. ఇక సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు రిలీజ్ బరిలో ఉన్నాయి. వీటిలో ఒకటి విరాఠఫర్వం... రెండోది లవ్ స్టోరి. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ రెండు సినిమాలు సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డాయి. ఇది నిజంగా సాయిపల్లవి అభిమానులకు నిరాశ కలిగించేదే.
ఇకపోతే సాయిపల్లవి ఇతర కథానాయికల్లా సోషల్ మీడియా పోస్టింగుల కోసం పాకులాడేది తక్కువే. రెగ్యులర్ ఫోటోషూట్లు అంతంత మాత్రమే. తన సినిమాల ప్రచారం మినహా సోషల్ మీడియాల్లో అంత స్పీడ్ కనిపించదు. ఇదిగో అప్పుడప్పుడు ఛమక్కులా మెరిసే అందమైన ఫోటోలను సాయి పల్లవి షేర్ చేస్తుంటే అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సాయిపల్లవి షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఆ పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ వైట్ టాప్ తో ఫిదా బేబి అదరగొట్టింది. రౌడీ బేబి ఇమేజ్ కి పూర్తి భిన్నమైన లుక్ ఇది.. సాయిపల్లవి ఎంతో అందంగా స్మైలిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.