స‌లార్ వ‌ర్సెస్ కేజీఎఫ్2.. అత‌డు లేనిదే..!?

Update: 2021-04-15 04:33 GMT
భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ల‌తో తెర‌కెక్కే మాఫియా డ్రామాల‌కు రీరికార్డింగ్ తో పాటు మ్యూజిక్ కి ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఏ.ఆర్.రెహ‌మాన్.. ర‌సూల్ పోకుట్టి లాంటి దిగ్గ‌జాలు గ్రేట్ డైరెక్ట‌ర్స్ తో క‌లిసి ప‌ని చేస్తే వ‌చ్చే ఔట్ పుట్ వేరేగా ఉంటుంది.

అయితే అలాంటి గొప్ప వాళ్లు లేకుండానే కేజీఎఫ్ చిత్రానికి గొప్ప ఔట్ పుట్ తేగ‌లిగారు ప్ర‌శాంత్ నీల్. ఇంత‌కీ ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌దానికి తాజాగా అత‌డి నుంచి స‌మాధానం వ‌చ్చింది.

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి కేజీఎఫ్ -చాప్ట‌ర్ 2 అయితే రెండోది స‌లార్. ఇవి రెండూ అత్యంత ప్రతిష్ఠాత్మ‌క‌మైన‌వి. మ్యూజిక్ ప‌రంగా చాలా హై చూపించాల్సి ఉంటుంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఆసక్తికరమైన సంబంధాన్ని పంచుకున్నారు.

ఓవైపు KGF చాప్టర్ 2 పోస్ట్-ప్రొడక్షన్ లో భాగంగా రీరికారికార్డింగ్ ప‌నులు చేస్తున్న నీల్ .. మ‌రోవైపు సలార్ మ్యూజిక్ సిట్టింగ్స్‌పై కూడా బిజీగా ఉన్నాడు. రెండు ప్రాజెక్టులకు సంగీతం పై క‌స‌ర‌త్తు సాగుతోంది.  బస్రూర్ రవి స్టూడియోలో ఈ రెండు ప్రాజెక్టులకు ప‌నులు సాగుతున్నాయ‌ని.. ఆశించిన దారిలో వెళుతున్నాయని నీల్ వెల్లడించారు. కేజీఎఫ్ చాప్టర్ 1 కోసం నీల్ ‌తో కలిసి పనిచేసిన రవి బసూరు సలార్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

సంగీత దర్శకుడు రవి బస్రూర్ తో కలిసి ఒక చిత్రాన్ని ట్విట్టర్ లో పంచుకున్న ప్ర‌శాంత్ నీల్ ..``కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ... #స‌లార్‌ మార్గాలు అధిగ‌మించే ఏకైక ప్రదేశం @ బస్రూర్‌రవి స్టూడియో !!! ఇంద్రజాలికుడు  ర‌వి బ‌స్రూర్ స్వయంగా సంగీతం కోసం పని చేస్తున్నారు`` అని ప‌రిచ‌యం చేశారు. ర‌వి బ‌స్రూర్ క‌న్న‌డంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు. ఇంత‌కుముందు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఉగ్రమ్ కి కూడా ఆయనే సంగీతం అందించారు. 2014 నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాల‌కు ప‌ని చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు.
Tags:    

Similar News