సూపర్ స్టార్ ఫ్యామిలీ.. ఎంజాయ్ చేశార్లే

Update: 2017-03-31 18:02 GMT
ఓ మరిచిపోలేని సందర్భానికి ఓ ఫ్యామిలీ అంతా ఓ పర్ఫెక్ట్ టూర్ వేసుకుంటే ఎలా ఉండాలి? దీనిపై ఇప్పటివరకూ పెద్దగా అబ్రివేషన్స్ లేవేమో కానీ.. ఇలా ఉండాలంటూ ఓ ఇన్సిడెంట్ ను చూపించారు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ. ప్రస్తుతం న్యూక్లియర్ ఫ్యామిలీల కారణంగా.. ముగ్గురు నలుగురు ఎంజాయ్ చేసి ఫ్యామిలీ వెకేషన్ అని చెప్పేసుకుంటున్న పరిస్థితి. కానీ సల్మాన్ మాత్రం.. ఏకంగా తన ఖాందాన్ మొత్తాన్ని వెకేషన్ కు పంపడం విశేషం.

సల్లూ భాయ్ కి పిల్లలంటే మహా ప్రీతి. తన సోదరి అర్పితా ఖాన్ కొడుకు.. తనకు స్వయానా మేనల్లుడు అయిన అహిల్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. అందుకే ఈ బుడ్డోడి పుట్టిన రోజు సందర్భంగా.. బంధువర్గ సపరివార సమేతం మొత్తాన్ని మాల్దీవ్స్ కి టూర్ పంపించేశాడు. మాల్దీవ్స్ లో మొత్తం కుటుంబమంతా కలిసి సూపర్బ్ గా ఎంజాయ్ చేసేశారు. అయితే.. ఇక్కడ కనిపించిన లోటు ఏంటంటే.. సల్మాన్ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు.

ప్రస్తుతం టైగర్ జిందాహై షూటింగ్ కోసం ఆస్ట్రియాలో ఉన్నాడు సల్మాన్. కానీ.. తను లేని లోటు కనిపించకుండా ఉండేందుకు.. గాళ్ ఫ్రెండ్ యూలియా వంతూర్ ను మాత్రం మాల్దీవ్స్ పంపాడు. అర్పితా ఖాన్ షేర్ చేసిన ఈ ఫోటోల్లో సల్మాన్ ఇద్దరు సోదరులు.. వారి కుటుంబాలతో పాటు.. అర్బాజ్ తో విడిపోతోన్న మలైకా అరోరా కూడా ఉండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News