టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని వారింటి కోడలు అయ్యాక కొత్తకొత్త ప్రయోగాలతో అభిమానులను మురిపిస్తోంది. కెరీర్ లోనే రంగస్థలం సినిమాలో తొలిసారి పల్లెపడుచు పాత్ర చేసి శభాష్ అనిపించుకుంది. రామలక్ష్మి పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా కనిపించిన శామ్ చాలాచాలా అందంగా కనిపించి అందరి గుండెలను కొల్లగొట్టేసింది.
రంగస్థలం తరవాత ఇప్పుడు సమంత మహానటి సినిమాలో వెండితెరపై కనిపించనుంది. ఇందులో మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రను సమంత చేస్తోంది. నిన్నటి జనరేషన్ లేడీగా సమంత లుక్ ఇప్పటికే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో సమంత ఇంకో ప్రయోగం చేస్తోంది. కెరీర్ లో తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతోంది. క్రీమ్ బన్ తింటూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటున్న ఫొటోను సమంత షేర్ చేసింది. నేను.. నా క్రీమ్ బన్.. మహానటి డబ్బింగ్ పూర్తయింది. అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది.
సమంత చెన్నైలో పుట్టి పెరిగినా తెలుగులో స్టార్ డమ్ రావడంతో మన భాష బాగానే నేర్చుకుంది. కానీ ఇంతవరకు డబ్బింగ్ మాత్రం చెప్పలేదు. అసలు రంగస్థలం సినిమాకే డబ్బింగ్ చెబుదామని శామ్ ప్రయత్నించింది. కానీ గోదావరి యాస పలకదని ఆమెతోపాటు డైరెక్టర్ సుకుమార్ ఫీలవడంతో ఆ ప్రయత్నం మానేసింది. ఎట్టకేలకు మహానటి సినిమాతో మన నటి గొంతు వినొచ్చన్నమాట. మే9న ఈ మూవీ థియేటర్లకు రానుంది.