కష్టంలో ఆదుకోవాలి అన్న మనసు ఎందరికి ఉంటుంది. డబ్బు ఉన్నా ధానధర్మాలు చేయడం సేవాగుణం అనేది కొందరికే సాధ్యం. ఇక ఇలాంటి విషయాల్లో అక్కినేని కోడలు సమంత అందరికీ ఆదర్శం. స్ఫూర్తి నింపే ఎన్నో కార్యక్రమాల్ని తమ ప్రత్యూష సేవా సంస్థ ద్వారా సమంత నిరంతరం చేస్తూనే ఉన్నారు.
ఇంతకుముందు పేద పిల్లలు నిరుపేద ఆడపిల్లల కోసం ప్రత్యూష సంస్థ చాలానే సాయపడింది. అలాగే వికలాంగులు బధిర చిన్నారుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. సమంత సేవలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంతటి వాడే .. సమంతను చూసి నేర్చుకోవాలి! అని పొగిడేశారంటే అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యూష సేవలు ఇక్కడికే పరిమితం అయ్యాయా? అంటే ఇప్పుడు మరో రూపంలోనూ సాయపడుతోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ భారీ వర్షాలకు అతలాకుతలం అయిన సంగతి విధితమే. తెలంగాణ రాజధాని నగరంలో ఇటీవల 150 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిరుద్యోగులుగా మిగిలారు. నిరుపేదల తిండి కష్టాలు గూడు లేని బాధలు అన్నీ ఇన్నీ కావు. నీట మునకలేసిన ప్రాంతం అంతా నిరుపేదలు ఉండేవే ఎక్కువ.
వర్షాల కారణంగా ఇళ్లు.. ఉద్యోగాలు కోల్పోయిన పేద ప్రజల దుస్థితిని చూసి కదిలిపోయిన సమంత ప్రత్యూష ఫౌండేషన్.. డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ తో చేతులు కలిపింది. ఈ సంయుక్త ఫౌండేషన్ వాలంటీర్లు ఆహారాన్ని తయారు చేసి దారుణ సన్నివేశాన్ని ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేశారు. ఓవైపు కరోనా విలయతాండవం మరోవైపు వర్షాల బెడదతో బిక్కుబిక్కుమంటున్న పేదలకు కనీసం ఆకలి లేకుండా చూడాలన్న ప్రయత్నం ఈ సంస్థలు చేస్తున్నాయి. హ్యాట్సాఫ్ టు సమంత అని చెప్పాలి.