ఫొటోస్టోరీ: సీమ అందం రాజా

Update: 2018-07-26 11:51 GMT
రంగ‌స్థ‌లం రామ‌ల‌క్ష్మికి కాస్త మేక‌ప్ వేస్తే ఎలా ఉంటుంది?  పూరి గుడిసె నుంచి ఆమె ఇలా  మేడ ఇంటి రేంజ్‌ కి వ‌స్తే ఎలా మారిపోతుంది? ఇదిగో ఇక్క‌డ స‌మంత ఎలా క‌నిపిస్తుందో - అచ్చం ఇలాగే మారిపోతుంది. కాదంటారా? అలాగ‌ని ఇక్క‌డ మేం రామ‌ల‌క్ష్మినే అలా ముస్తాబు చేశామ‌ని అనుకోమాకండి. ఈమె రామ‌ల‌క్ష్మి కాదు. సీమ అందం పులుముకున్న త‌మిళ‌మ్మాయి. `సీమ రాజా` చిత్రం కోసం ఇలా ముస్తాబైంది. స‌మంత ఈ యేడాది ఇప్ప‌టికే మ‌హాన‌టి - రంగ‌స్థ‌లం - అభిమ‌న్యుడు చిత్రాల‌తో అద‌ర‌గొట్టి విజ‌యాల్ని అందుకొంది. త‌మిళంలో మ‌రికొన్ని కీల‌క‌మైన ప్రాజెక్టులు చేస్తూ సంద‌డి చేస్తోంది.

అందులో ఒక‌టి `సీమ రాజా`. ఇందులో శివ‌కార్తికేయ‌న్ హీరో. ఆయ‌న స‌ర‌స‌న స‌మంత న‌టించింది. అందులోనూ ప‌ల్లెటూరి అమ్మాయిగానే క‌నిపించ‌బోతోంది. కాక‌పోతే మ‌రీ రంగ‌స్థ‌లం రేంజిలో కాదు కానీ.. కాస్త క్లాస్‌ గానే క‌నిపించ‌బోతోంది. ఆ చిత్రంలోని లుక్ ప్ర‌స్తుతం ఆన్‌ లైన్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. స‌మంత పైట క‌ట్టి - త‌న కుడి భుజంపై వాలిన పావురంతో ఏవో మాట‌లు చెబుతూ అందంగా అల‌రిస్తోంది.  ఈ చిత్రంతో మ‌రో హిట్టు ఖాయ‌మ‌ని న‌మ్మ‌కంగా  చెబుతోంది స‌మంత‌. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  స‌మంత న‌టిస్తున్న మ‌రో చిత్రం యూ ట‌ర్న్‌తో పాటు - సీమ రాజా కూడా ఒకేసారి విడుద‌ల కావొచ్చ‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌మంత మాత్రం ఈ రెండూ క్లాష్ కాకుండా చూసుకోమ‌ని నిర్మాత‌ల‌కి స‌ల‌హా ఇస్తోంద‌ట‌.
Tags:    

Similar News