సమంత డబ్బింగ్ వర్కౌట్ అయ్యింది

Update: 2018-05-10 06:04 GMT
తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికి గుర్తించుకునే సావిత్రి తెర వెనుక జీవితాన్ని మనసుకు తాకేలా చూపించిన నాగ్ అశ్విన్ ని ఎంత పొగిడిన తక్కువే. ప్రతి పాత్రలో సున్నితమైన భావాలను కలిగించేలా చేశాడు. ఒక సినిమాలో ప్రాణం ఉంటుంది అనడానికి సావిత్రి బయోపిక్ నిదర్శనం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ - సమంత పాత్రలు కూడా బాగా క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా సమంత పాత్ర ప్రతి సావిత్రి అభిమానిని కదిలించింది. అభిమాని మనసులో ఉన్న బావలనే ఆమె ద్వారా దర్శకుడు చూపించాడు.

ఆమె చేసిన మధురవాణి పాత్ర చాలా గొప్పది. అలాగే క్లయిమాక్స్ లో సమంత నటించిన విధానం వర్ణనాతీతం. ప్రాణం పెట్టి నటించేసింది. అందుకు ముఖ్య కారణం ఆమె డబ్బింగ్ అని కూడా చెప్పవచ్చు. ఇన్నేళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ లో సమంత ఎంతో మంది అగ్ర దర్శకులతో వర్క్ చేసింది. కానీ ఎవ్వరు కూడా ఆమె పాత్ర కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ మహానటి లాంటి ప్రయోగాత్మక బాధ్యత గల చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ ప్రయగం చేశాడు అంటే అతని ప్రతిబని మెచ్చుకోవాల్సిందే.

ప్రతి సీన్ లో సమంత వాయిస్ ఆ పాత్రకు తగ్గట్టుగానే కనిపించింది. క్లయిమాక్స్ ఏడిపించేసిందని చెప్పాలి. అమాయకపు మధురవాణి లో ఎన్నో కోణాలు చూపించిన సమంత అలనాటి అందాల తార కథలో బాగమైనందుకు ఆమె అదృష్టం అని చెప్పాలి. ఏదేమైనా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన విధానం సమంతకి మంచి గుర్తింపును తెచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags:    

Similar News