అక్కినేని కుటుంబంలో ఏ సినిమా తెరకెక్కినా ఇంటిల్లిపాదీ సోషల్ మీడియా ప్రమోషన్స్ లో ఎంత బిజీగా ఉంటారో తెలిసినదే. ముఖ్యంగా అక్కినేని కోడలు సమంత ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టరు. ఇప్పుడు మామగారు నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ని అంతే జోరుగా సాగిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 2న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థయేటర్లలో విడుదలైంది. కింగ్ ఎంతో హోప్ తో ఉన్న సినిమా కావడంతో ప్రచారంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? అంటే సామ్ రివ్యూ చదవాల్సిందే.
ఈ సినిమాకి ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్ షోలు చూసిన వాళ్ల నుంచి సోషల్ మీడియాలో రివ్యూలు వస్తున్నాయి. మరి కాసేపట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా రివ్యూలు రెడీ అయిపోతాయి. ఈలోగానే సమంత నుంచి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. వైల్డ్ డాగ్ ప్రత్యేక స్క్రీనింగ్ వీక్షించిన అనంతరం సామ్ ట్విట్టర్ లో ఎంతో ఎమోషనల్ గా స్పందించారు. మామ సినిమాపై ప్రశంసలను కురిపించారు. అద్భుతం .. హాలీవుడ్ రేంజు అంటూ ఈమోజీలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
``ఇప్పుడే వైల్డ్ డాగ్ సినిమా చూసాను. చాలా అద్భుతంగా ఉంది. నేను నిజంగా మంచి యాక్షన్ చిత్రాన్ని కోల్పోయాను. హాలీవుడ్ స్టైల్ కిక్కాస్ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. సీట్ అంచున కూచుని చూశాను`` అని సామ్ ట్వీట్ చేశారు. నిజానికి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం సమంతకు వచ్చినా కాదనుకున్నారు. అందుకే ఛాన్స్ కోల్పోయానని సామ్ వ్యాఖ్యానించారన్నమాట.
ఈ చిత్రంలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ గురించి ఆమె ప్రస్తావించినందుకు అక్కినేని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి గ్రిప్పింగ్ ట్రీట్ మెంట్ ఉన్న చిత్రంలో నాగార్జునను చూడాలని ఇంతకాలం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామ్ రివ్యూలో చెప్పినట్టే సినిమాలో కంటెంట్ ఉంటే .. అక్కినేని కాంపౌండ్ మరో బ్లాక్ బస్టర్ ని ఖాయం చేసుకోవచ్చు.