మొదటి హీరోతో మరోసారి సమంత?

Update: 2018-01-25 05:10 GMT
హీరోయిన్ సమంత అక్కినేని వారింటి కోడలు అయ్యాక సినిమాలు ఆచితూచి చేస్తోంది. పెళ్లికి ముందు కమిట్ అయిన వాటిలో రామ్ చరణ్ తో నటించిన రంగస్థలం..  విశాల్ తో నటించిన ఇరుంబు తిరయ్ (తెలుగులో అభిమన్యుడు) ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. తాజాగా సమంత తన తొలి హీరోతో కలిసి మళ్లీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే అది తెలుగులో నటించిన తొలి హీరో.. సమంత భర్త నాగచైతన్యతో కాదు.

సమంత కోలీవుడ్ లో మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో మొదటగా నటించింది. ఇందులో హీరో అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్. వీళ్లిద్దరూ కలిసి నటించిన తమిళ సినిమా రిలీజ్ బాగా ఆలస్యం కావడం.. బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. తాజాగా రాహుల్ రవీంద్రన్ సమంతతో కలిసి యు-టర్న్ అనే కన్నడ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తీయనున్నారు. కన్నడ వెర్షన్ తీసిన పవన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

రాహుల్ రవీంద్రన్ - సమంత మొదటి నుంచి ఫ్రెండ్స్. అదీ కాక అతడు సమంతకు మొదటి నుంచి తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెబుతూ వస్తున్న సింగర్ చిన్మయి భర్త కూడా. అందుకే చిన్న చిత్రమైనా సమంత లాంటి స్టార్ హీరోయిన్ యు-టర్న్ రీమేక్ లో నటించడానికి ఓకే చెప్పేసింది.
Tags:    

Similar News