2005లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన `నరసింహుడు` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ముంబై సోయగం సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ వంటి సినిమాలలో నటించింది. 2014లో అక్షయ్ వర్డేని వివాహం చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పేసింది. ఇద్దరు పిల్లలకు తల్లైన సమీరా రెడ్డి తాజాగా షాకింగ్ విషయాలని బయటపెట్టింది. ఇద్దరు పిల్లలు, భర్తతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమీరా రెడ్డి పదేళ్ల క్రితం తన కెరీర్ లో జరిగిన షాకింగ్ విషయాలని తాజాగా బయట పెట్టింది.
బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తూ ఎంత మందికి తన వంతు సహాయ సహకారాల్ని అందిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటోంది. ఈ నేపత్యంలో పదేళ్ల క్రితం తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న షాకింగ్ విషయాలని వెల్లడించింది.
ఆ రోజుల్లో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తనని బ్రెస్ట్ సర్జరీ చేసుకోమని చాలా మంది సూచించారట. అయితే దాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది సమీరా. పదేళ్ల క్రితం క్రేజీ ఫేజ్ వుండేది. చాలా మంది హీరోయిన్ లు బ్రెస్ట్ కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తున్న రోజులవి. అదే కాకుండా గ్లామర్ గా కనిపించడం కోసం ముక్కు, ఎముకల మార్పులకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే వారు.
అది గమనించిన చాలా మంది నన్ను కూడా అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం ప్యాడ్ లని వాడుతూ కవర్ చేసుకునే దాన్ని. ఏంటీ ఇదేమైనా ఆచారమా? అని నాకు నేను చాలా సార్లు అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది బ్రెస్ట్ కోసం సర్జరీ చేసుకోమని బహిరంగంగానే నన్ను అడిగారు. నటిగా నేను దీన్ని ఖచ్చితంగా పాటించాలా? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ తరువాత అలా చేయకూడదని అనుకున్నాను. అందరిలా నేను సర్జరీలకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ విషయంలో చాలా సంతృప్తిగా వున్నాను. చాలా మందికి ఆ రోజుల్లో అది అవసరం అనిపించింది. కానీ నాకు అనవసరం అనిపించింది. అందుకే కొందరిలా నేను బ్రెస్ట్ సర్జరీ చేయించుకోలేదు` అని తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.