అమ్మా.. నిన్నెప్పుడూ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటా!

Update: 2019-05-13 05:47 GMT
నిన్న ప్రపంచ వ్యాప్తంగా చాలామంది మదర్స్ డే సెలెబ్రేట్ చేసుకున్నారు. చేసుకోని వాళ్ళగురించి వదిలేయండి.. చేసుకున్న వారిగురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుందాం.  దాదాపు అందరూ సెలబ్రిటీలు అమ్మతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.. కొందరేమో అమ్మతో కలిసి ఉన్న తమ చిన్ననాటి ఫోటోలు పోస్ట్ చేశారు. "మా అమ్మ బ్యూటిఫుల్" అన్నారు. కొందరు "మా అమ్మ ది బెస్ట్" అన్నారు.  నిజంగా అమ్మపై ఈ ప్రేమను ఒక్కరోజు కాకుండా ప్రతిక్షణం.. ప్రతిరోజూ చూపించాలని మనం కోరుకుందాం.  ఎందుకంటే అమ్మ లేకపోతే మనం లేము!

అయితే అందరూ ఒక ఎత్తు.. సనా ఖాన్ మదర్స్ డే పోస్ట్ ఒక ఎత్తు.  ఇంత సనా ఖాన్ ఎవరంటే బాలీవుడ్ నటి.  ఐదు భాషలలో 14 సినిమాల్లో నటించింది.  తెలుగులో 'కళ్యాణ్ రామ్ కత్తి' సినిమాలో కూడా నటించింది.  ఇక సనా మదర్స్ డే వీడియో గురించి మాట్లాడుకుంటే. అందరిలాగా జస్ట్ ఒక ఫోటోను పోస్ట్ చేయలేదు.. వీడియో  పోస్ట్ చేసింది. ఇందులో సనా అమ్మగారిపై పడిపోయి ముద్దుల వర్షం కురిపించింది.  ఆమె ఇక చాలు.. ఆపు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టినా 'అమ్మ బొమ్మాళి నిన్నొదల' అన్నట్టుగా చెలరేగిపోయింది. ఈ అల్లరి కూతురి అతిప్రేమను తట్టుకోలేక..ఏమీ అనలేక ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయింది.

ఇలాంటి వీడియో పోస్ట్ చేసి "నేను షరతులు లేని ప్రేమ ఇక్కడ ఉందని తెలుసుకునేంతవరకూ దాని కోసం వెతుకుతూ ఉన్నాను.   అలాంటి ప్రేమను నాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ అమ్మా.  హ్యాపీ మదర్స్ డే .  నోట్: అమ్మా.. నిన్ను నేనెప్పుడూ ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటా. నువ్వు ఎన్ని సార్లు ఇక చాలు అన్నా ఇది ఆగేది కాదు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

ఇక చూడాలి ఈ వీడియోకు ఇంట్రెస్టింగ్ రెస్పాన్సులు వచ్చాయి. చాలామంది దీన్ని "అతిప్రేమ" అన్నారు.  "ఇది ది బెస్ట్ మదర్స్ డే వీడియో" అని ఒకరు అన్నారు.  మరొకరు "సనా.. అమ్మను కాస్త ఊపిరి తీసుకోనివ్వు" అన్నారు .  ఒకరు "ఇది వీడియో ఆఫ్ ది ఇయర్" అన్నారు.  కొందరేమో "ఇది కెమెరాల ముందు నటన" అని విమర్శించారు. ఆలస్యం ఎందుకు.. వీడియో పై ఒక లుక్కేయండి.

For Video Click Here
Tags:    

Similar News