పాన్ ఇండియాని టార్గెట్ చేసిన శాండిల్వుడ్ స్టార్స్!

Update: 2022-12-10 11:31 GMT
`కేజీఎఫ్‌`..`కాంతారా` లాంటి చిత్రాలు క‌న్న‌డిగుల ఆలోచ‌నా విధానాన్నే మార్చేసాయి. రెండు చిత్రాలు పాన్ ఇండియాలో భారీ విజ‌యం సాధించ‌డంతో?  సొంత భాష‌లోనే కాదు..ప‌రాయి భాష‌ల్ని టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. య‌శ్...రిష‌బ్ శెట్టి ఇక‌పై ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారు. ఆ త‌ర‌హా కంటెంట్ ఎంపిక చేయ‌డం..సినిమా చేయ‌డ‌మే ఆల‌స్యం. ఆ హీరోలిద్ద‌ర్ని తెర‌పై  చూసేందుకు  ప్రేక్ష‌కులు సిద్దంగా ఉన్నారు.

అయితే వీళ్లిద్ద‌రి కంటే ముందు క‌న్న‌డ న‌టుడు సుదీప్  సౌత్ లో ఫేమ‌స్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేసారు. తెలుగు..త‌మిళ భాష‌ల్లో హీరో అనే ట్యాగ్ ని ప‌క్క‌న‌బెట్టి వ‌చ్చిన సహాయ పాత్ర‌ల‌న్నింటిలోనూ న‌టించాడు. `ఈగ` లాంటి సినిమాలో విల‌న్ గా న‌టించి అంత‌ర్జాతీయ స్థాయిలో పాపుల‌ర్ అయ్యాడు. అటుపై బాహుబ‌లి....సైరా న‌ర‌సింహారెడ్డిలాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లోనూ న‌టించాడు.

త‌మిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. ఇప్పుడు తెలుగు మార్కెట్ అంత‌కంత‌కు విస్త‌రించ‌డంతో ఎలాంటి ఆఫ‌ర్ వ‌చ్చినా వాలిపోవ‌డానికి రెడీగా ఉన్నాడు. ఇదే  కోవ‌లో మ‌రింత మంది క‌న్న‌డిగులు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే క‌న్న‌డ సూప‌ర్ స్టార్ గా దూసుకుపోతున్న శివ‌రాజ్ కుమార్ జైల‌ర్  చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

అలాగే ధ‌నుష్  కొత్త సినిమాకి సంత‌కం చేసారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ అన్ని  భాష‌ల్లోనూ రిలీజ్ కానున్నాయి. అలాగే బాల‌కృష్ణ  క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న వీర‌సింహారెడ్డిలో మ‌రో క‌న్న‌డ‌ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్ గా న‌టిస్తున్నారు.  ర‌క్షిత్ లాంటి హీరో కూడా తెలుగులో అవ‌కాశాలు  వ‌స్తే న‌టించ‌డానికి రెడీగా ఉన్నాడు.

ఇప్ప‌టికే త‌న క‌న్న‌డ చిత్రాల్ని  తెలుగులో త‌ప్ప‌క అనువాద‌మ‌య్యేలా చూసుకుంటున్నాడు. ఇంకా యంగ్ స్టార్స్ స‌హా సీనియ‌ర్ హీరోలు కూడా  తెలుగు..త‌మిళ్..హిందీలో ఛాన్సులొస్తే న‌టించ‌డానికి రెడీగా ఉన్నారు. మ‌ల‌యాళం న‌టులు దుల్కార్ సల్మాన్.. ఫ‌హాద్ ఫాజ‌ల్...ఉన్నిముకుంద‌న్ లాంటి వారు తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News