కొత్త హీరోయిన్ తో డేటింగ్ లో సందీప్ కిషన్!

Update: 2019-09-24 14:30 GMT
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు.  తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా హీరోగా నటిస్తూ పాపులారిటీ సాధించాడు.  రీసెంట్ గా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి హిట్ సాధించాడు.  ఇదంతా బాగానే ఉంది కానీ సందీప్ పై డేటింగ్ రూమర్లు రావడం మాత్రం ఆగడం లేదు.

గతంలో కొందరు బ్యూటిఫుల్ హీరోయిన్లతో సందీప్ కొంచెం ఎక్కువగా 'ఫ్రెండ్ షిప్' చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కొందరు ఆ ఫ్రెండ్షిప్ ను లవ్ అని అర్థం చేసుకుంటే.. మరికొందరు దాన్ని డేటింగ్ అని అర్థం చేసుకున్నారు.  ఎవరికి తోచినట్టు వారు ఫిక్స్ అయ్యారు.  ఈ విషయాలని ఇంటర్వ్యూలో ఎప్పుడు సందీప్ ను అడిగినా 'అబ్బే.. అలాంటిదేమీ లేదు' అని క్లారిటీ ఇస్తాడు.  ఇంకా ఎక్కువ మాట్లాడితే 'మీరే ఇవన్నీ సృష్టిస్తారు.. మీరే ఏం తెలియనట్టు నన్ను అడుగుతారు' అంటూ మీడియాకే సాఫ్ట్ పంచ్ వేస్తాడు.  ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. తాజగా మన హ్యాండ్సమ్ బాయ్ ఒక కొత్త హీరోయిన్ తో అచ్చికబుచ్చికలాడుతున్నాడని టాలీవుడ్ లో ఫ్రెష్ టాక్ వినిపిస్తోంది.  ఇప్పటి వరకూ సందీప్ పేరుతో లింక్ అయిన బ్యూటీలు వేరు.. ఈ బ్యూటీ వేరు అని సమాచారం.

మరి దీన్ని కూడా సందీప్ కిషన్ బాబు.. 'జస్ట్ గాసిప్' అని తీసి పారేస్తాడా లేదా అనేది తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాలి. ఏదేమైనా క్లారిటీ మాత్రం మన సందీప్ భయ్యానుంచి వస్తేనే బాగుటుంది.   కొంచెం అయినా నిప్పు లేకపోతే ఇంత డేటింగ్ పొగ రాదు కదా.  


Tags:    

Similar News