ఏకలవ్య కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ మూవీ

Update: 2019-01-14 11:30 GMT
సుమంత్ హీరోగా ఇషా రెబ్బ హీరోయిన్ తెరకెక్కి కొన్ని వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం" మంచి టాక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా చాలా కూల్ గా, ఆకట్టుకునే విధంగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ దర్శకుడితో సందీప్ కిషన్ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. సంక్రాంతి సందర్భంగా సినిమా ను ప్రకటించారు.

యువ కథానాయకుడు సందీప్ కిషన్ వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సంతోష్ జాగర్లమూడి చెప్పిన కథకు ఒకే చెప్పాడు. ఈ సినిమా మహాభారతంలోని ఏకలవ్యుడి కాన్సెప్ట్ తో రూపొందనుందట. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా భావించి ఆయన విగ్రహం ముందు విద్యను అభ్యసిస్తాడు. ఆతర్వాత గురుదక్షిణగా బొటనవేలును ఇస్తాడు.

అలాగే మోడ్రన్ ఏకలవ్యుడిగా సందీప్ కిషన్ కనిపించబోతున్నాడట. గురువు అడిగిన గురుదక్షిణ ఏంటి, అసలు సందీప్ కిషన్ నేర్చుకున్న ఆట ఏంటో సినిమా వచ్చిన తర్వాత తెలియనుంది. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించడంతో పాటు షూటింగ్ ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
    

Tags:    

Similar News