తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు ఆయన తనయుడు ధృవ్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ నిన్నటి నుండి ప్రారంభం అయ్యింది. ధృవ్ మొదటి సినిమా ఆధిత్య వర్మ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అలాంటి సమయంలో తండ్రితో కలిసి నటించబోతున్నాడు. విక్రమ్ 60వ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ఈ సినిమాకు అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా కు గాను అనిరుథ్ వర్క్ కూడా స్టార్ చేశాడని టాక్ వచ్చింది. కాని షూటింగ్ ప్రారంభించిన రోజు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పెద్ద మార్పును అధికారికంగా ప్రకటించాడు.
విక్రమ్ 60 సినిమాకు అనిరుథ్ కాకుండా సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించబోతున్నాడు అంటూ దర్శకుడు కార్తీక్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పలికాడు. సంతోష్ నారాయణ్ హఠాత్తుగా ఈ సినిమా కు ఎంట్రీ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ అనిరుథ్ ను ఉద్దేశించి కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్ చేశాడు. తమిళం తో పాటు తెలుగులో కూడా పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.