కమెడియన్ సప్తగిరి ఫైనల్ గా రెండో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. మొదటి సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా అంతంత మాత్రంగానే ఆడటంతో ఈ సారి ఎలాగైనా సప్తగిరి LLB తో హిట్ కొట్టి తన మార్కెట్ ను కొంచెమైనా పెంచుకోవాలని చూస్తున్నాడు. సినిమాకు ప్రమోషన్స్ కూడా కొంచెం హై లెవెల్ లో చేస్తున్నాడు. ఏకంగా రామ్ చరణ్ - నాని వంటి స్టార్స్ తో సినిమా ట్రైలర్స్ ని సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ.. హైప్ క్రియేట్ తెచ్చుకున్నాడు.
అయితే సినిమా కథ ఏ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయినా కలెక్షన్స్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ సినిమా నెక్స్ట్ వీక్ 8న రిలీజ్ కాబోతోంది. అప్పుడు సప్తగిరికి అంతగా పోటీగా ఏ సినిమా రావట్లేదు. అక్కినేని మేనల్లుడు సుమంత్ - మళ్లీ రావా సినిమా ఒక్కటే రిలీజ్ అవుతోంది. అయితే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. అలాగే ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఫ్లాప్ సినిమాలతో చాలా విసిగిపోయారు. ఫుల్ ఫన్ ఉండే సినిమాను చూసి చాలా కాలమే అవుతోంది.
దీంతో సప్తగిరికి అది ప్లస్ పాయింట్ అయ్యింది. ట్రైలర్ కూడా కొంతవరకు బాగానే ఉండడంతో బిసి సెంటర్లలో సినిమా కి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంత వరకు పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా రేంజ్ పెరిగిపోతోంది. అంతే కాకుండా రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లేవు. డిసెంబర్ 21 నుంచి పెద్ద సినిమాల వాతావరణం మొదలవుతుంది. మరి ఈ గ్యాప్ ని కమెడియన్ ఎంతవరకు పాజిటివ్ గా మార్చుకుంటాడో చూడాలి.