మహేష్ నటిస్తున్న `సర్కార్ వారి పాట` జనవరి తర్వాతే షూటింగ్ అంటూ ఇటీవల ప్రచారమైంది. సాంకేతిక కారణాలతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని పుకార్లు షికారు చేశాయి. అయితే ఇది నిజమా? అన్నది ఎంక్వయిరీ చేస్తే అబద్ధమేనని తేలింది.
పరశురామ్ కంటే ముందే త్రివిక్రమ్ బరిలో దిగి మహేష్ కి గాలం వేసేస్తున్నారని దీంతో ప్లాన్ ఛేంజ్ అయ్యిందని కూడా కాస్త అడ్వాన్స్ డ్ గా ప్రచారం సాగిపోయింది. కానీ అవేవీ నిజాలు కావని తాజాగా తెలిసింది. ప్రణాళిక ప్రకారం సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ చాలా ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. షూటింగ్ కోసం మేకర్స్ ప్రిపేర్ అవుతున్నారట. అయితే ఈ చిత్రం షూట్ జనవరిలో మాత్రమే జరిగేందుకు ఆస్కారం లేకపోలేదని తెలుస్తోంది. చిత్ర బృందం ఇటీవల అమెరికాకు బయలుదేరింది. ఈ చిత్రం కోసం లొకేషన్లను వెతికారు. ఫ్లోరిడా షూట్ కి అనువైనదని దర్శకుడు పరుశురాం బృందం అభిప్రాయపడింది. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ చిత్రం యుఎస్ లో జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు.
ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ఇందుకుముందు రిలీజైతే అభిమానుల్లో పోస్టర్ జోరుగా వైరల్ అయ్యింది. మహేష్ చిత్రం కోసం ఎస్.ఎస్.థమ్ అదిరిపోయే బాణీలు ఇవ్వాలని కసిగా ఉన్నారట. అల వైకుంఠపురములో రేంజ్ కావాలని మహేష్ అతడిని పుష్ చేస్తున్నారట.