మ‌హేష్ రికార్డులు బ‌ద్ద‌లుకొట్టిన బ‌న్నీ

Update: 2016-05-17 19:30 GMT
డివైడ్ టాక్ తో మొద‌లైన భారీ బ‌డ్జెట్ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావ‌డ‌మే ఆశ్చ‌ర్య‌మంటే క‌లెక్ష‌న్ల రికార్డుల్ని తిర‌గ‌రాయ‌డం ఇంకా చిత్రం. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘స‌రైనోడు’ ఈ బాట‌లోనే సాగుతోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా కొన్ని ఏరియాల్లో క‌లెక్ష‌న్ల రికార్డుల్ని తిర‌గ‌రాసింది. రూ.60 కోట్ల‌కు పైగా షేర్.. రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస‌ర్స్ జాబితాలో ఐదో స్థానానికి చేరిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ‘స‌రైనోడు’ ఖాతాలో మ‌రికొన్ని రికార్డులు చేరాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన నాన్-రాజ‌మౌళి సినిమాగా ‘స‌రైనోడు’ రికార్డు సృష్టించింది. బాహుబ‌లి.. మ‌గ‌ధీర మాత్ర‌మే దీని కంటే ముందున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రూ.38.2 కోట్ల షేర్‌.. క‌ర్ణాట‌క‌లో రూ.7.2 కోట్ల షేర్ వ‌సూలు చేసి నాన్‌-రాజ‌మౌళి సినిమాల రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టింది ‘స‌రైనోడు’. ఈ ఏరియాల్లో ఇప్ప‌టిదాకా ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న రికార్డుల్ని స‌రైనోడు దాటేసింది.

వైజాగ్ ఏరియాలో అయితే ఏకంగా రూ.7.48 కోట్ల షేర్ వ‌సూలు చేసి నాన్‌-బాహుబ‌లి రికార్డునే సొంతం చేసుకుంది ‘స‌రైనోడు’. ఇక్కడి క‌లెక్ష‌న్లు ‘శ్రీమంతుడు’.. ‘మ‌గ‌ధీర’ వ‌సూళ్ల‌ను కూడా దాటేశాయి. ‘స‌రైనోడు’ సినిమా బ‌న్నీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్-మ‌హేష్ బాబుల‌కు గ‌ట్టి పోటీదారుగా మార్చేసింద‌న‌డంలో సందేహం లేదు. మొత్తంగా 25 రోజుల్లో స‌రైనోడు రూ.68.4 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ క‌లెక్ట్ చేయ‌డం విశేషం.
Tags:    

Similar News