స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ సరైనోడు.. ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్స్ మార్క్ ను అందుకుంది. షేర్ విషయంలో కాదు కానీ.. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టి, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాడు సరైనోడు. ఈ 100 కోట్ల గ్రాస్ మార్కును రిలీజ్ డేట్ నుంచి 17 రోజుల్లోనే అందుకోవడం.. బన్నీ సృష్టించిన రికార్డ్ అనాల్సిందే.
గతంలో బన్నీ నటించిన రేసుగుర్రం ఒక్కటే ఈ ఫీట్ ను సాధించగలిగింది. ఇప్పుడు సరైనోడు తో మరోసారి 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న అల్లు వారబ్బాయి.. 60 కోట్లకు పైగా షేర్ ను సాధించాడు. నిజానికి ఈ మూవీకి తొలి రోజున డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు, రేటింగులు కూడా పూర్ గానే ఉన్నాయి. అయినా సరే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బన్నీ సంచలనాలు సృష్టించేశాడు.
తొలిసారిగా అల్లు వారబ్బాయి ఊర మాస్ మూవీలో నటించడం, బోయపాటి డైరెక్షన్, సమ్మర్ సీజన్.. అన్నీ కలిసి సరైనోడు బ్లాక్ బస్టర్ చేసేశాయి. 54 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ విక్రయించగా.. షేర్ మొత్తమే 60 కోట్లను దాటిపోవడంతో.. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇంకా చెప్పుకోదగ్గ థియేటర్లే సరైనోడి ఖాతాలో ఉండడంతో.. ఈ జోరు మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.