‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది సీరత్ కపూర్. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆమె పాత్రలు కూడా తేలిపోయాయి. రాను రాను సీరత్ కు సినిమాల్లో ప్రాధాన్యం తగ్గిపోయింది. ‘రాజు గారి గది-2’.. ‘ఒక్క క్షణం’ లాంటి సినిమాల్లో సీరత్ క్యారెక్టర్లు.. ఆమె లుక్స్ ఏమాత్రం జనాల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు ఆమె దృష్టంతా ‘టచ్ చేసి చూడు’ మీదే ఉంది. ఈ సినిమాతో అమీతుమీ తేల్చుకోవాలని సీరత్ భావిస్తున్నట్లుగా ఉంది. నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ‘రాయే రాయే..’ అంటూ ఒక పాట వీడియోను లాంచ్ చేశారు.
ఈ పాట చూస్తే సీరత్ ఆలౌట్ గ్లామర్ అటాక్ మొదలుపెట్టేసినట్లుగా అనిపిస్తోంది. గత సినిమాలతో పోలిస్తే సీరత్ మరింత గ్లామరస్ గా.. సెక్సీగా కనిపిస్తోంది ఈ పాటలో. వరుస ఫెయిల్యూర్లతో కెరీర్ ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ‘టచ్ చేసి చూడు’ లాంటి మాస్ సినిమాలో గ్లామర్ రోల్ క్లిక్ అయితే మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని సీరత్ భావిస్తోంది. ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నా కొంచెం పద్ధతైన క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె పాత్ర పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ లాగా కూడా ఉంటుందట. కాబట్టి గ్లామర్ అటాక్ మొత్తం సీరతే చూసుకోబోతోందట. మరి ఈ సినిమా సీరత్ కు ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.
Full View