ప్రభాస్ గొప్పదనాన్ని చెప్పిన రైటర్ తోట ప్రసాద్
బిల్లా స్టోరీ డిస్కషన్ కోసం వెళ్లినప్పుడు ప్రభాస్ చేసిన గౌరవ మర్యాదల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు తోట ప్రసాద్.
టాలీవుడ్ రచయిత తోట ప్రసాద్ పలు సినిమాలకు రచయితగా పని చేశాడు. తాజాగా ఆయన ప్రభాస్ గొప్పదనాన్ని ఓ సందర్భంలో చెప్పాడు. ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమా కోసం వర్క్ చేసిన ఆయన ప్రభాస్ ను ఆకాశానికెత్తేశాడు. బిల్లా స్టోరీ డిస్కషన్ కోసం వెళ్లినప్పుడు ప్రభాస్ చేసిన గౌరవ మర్యాదల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు తోట ప్రసాద్.
అది మాత్రమే కాకుండా తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభాసే తనకు సాయం చేశాడని, ఆయనకు ఎంతో గొప్ప మనసుందని తెలిపాడు. 2010లో ఆరోగ్యం బాలేక తాను హాస్పిటల్ లో చేరానని చెప్పాడు. అదే టైమ్ లో ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారని తోట ప్రసాద్ తెలిపాడు.
అలాంటి టైమ్ లో కూడా ప్రభాస్ తన గురించి ఆలోచించాడని తోట ప్రసాద్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. తండ్రి మరణించడమంటే ఎవరైనా ఎంతటి బాధలో ఉంటారో తెలుసు. అలాంటి టైమ్ లో కూడా తన రైటర్ గురించి ప్రభాస్ ఆలోచించి, పర్సనల్ గా ఓ మనిషిని పంపి, తన హాస్పటిల్ ఖర్చులకు డబ్బును కూడా పంపాడని, డార్లింగ్ గొప్పదనాన్ని చెప్తూ తోట ప్రసాద్ చాలా ఎమోషనల్ అయ్యాడు.
బిల్లా సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆయనతో పని చేసే అవకాశం కన్నప్ప సినిమా ద్వారా తనకు దక్కిందని, అలాంటి మంచి మనసున్న వ్యక్తితో మరోసారి పని చేసే ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని తోట ప్రసాద్ తెలిపాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం మారుతితో ది రాజా సాబ్ చేస్తున్న ఆయన, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ తో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఉగాదికి సందీప్ రెడ్డి వంగా సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటూ సలార్2, కల్కి2 సినిమాలకు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.